టిడిపి జనసేన కోసం ఎత్తులు జనసేనతో పొత్తుకు పాట్లు

పవన్ ను కలిసి రావాలని ఆహ్వానించారు చంద్రబాబు, పవన్ నో అన్నారు. అయినా టిడిపి ఇంకా అసలు పెట్టుకుంటూ తమతో పవన్ కలిసి వస్తారనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. గతంలో జగన్, పవన్, మోదీ, కెసిఆర్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన టిడిపి నేతలొ సడన్ గా మార్పు. ఈ లిస్టు నుండి పవన్ పేరు మినహాయింపు. మిగిలిన ముగ్గురు లక్ష్యంగా విమర్శలు. తాజాగా పార్టీ నేతల టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లుగా వార్తలు. టీడీపీ జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇస్తున్నాయి. మరి నో చెప్పిన పవన్ ఎస్ అంటారా.

పవన్ పై విమర్శలు వద్దు, చెప్పింది చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లోలో వచ్చే ఎన్నికల్లో వ్యూహాలపై పలు సూచనలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ బిజెపి, టిఆర్ఎస్, వైయస్సార్ ల పై విమర్శలు చేయాలని. ఆంధ్రా కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఉందని ద్వేష ప్రచారం చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరెంట్ల బూచి చౌదరి జోక్యం చేసుకొని పవన్ ను కూడా విమర్శించాలని అనగా చంద్రబాబు ఆగ్రహం తెచ్చుకొని తను చెప్పింది చేయాలని ఆదేశించారు. విశ్వనీయ వర్గాల సమాచారం, కొద్ది రోజుల క్రితం పవన్ తమతో కలిసి రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అయితే పవన్ తిరస్కరించడం తెలిసింది. 2014 ఎన్నికల్లో జనసేన బిజెపిల పొత్తు కారణంగా టిడిపి లాభం పొందింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ టిడిపి పై అవినీతి ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం మొదలైంది.

పవన్ చెప్పిన ఆరోపణలపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. ఇక టీడీపీ జనసేన మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఈ మధ్యకాలంలో పవన్ తమతో కలిసి రావాలని ఓపెన్గా ఆహ్వానించారు, అయితే పవన్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు పవన్. అయినా టీడీపీ నేతలు ఎవరూ పవన్ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. ఇక ఇదే సమయంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మారుతున్న సమీకరణాలు సంకేతాలు గా నిలిచాయి. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి జగన్ పైన పవన్ చేసిన వ్యాఖ్యలతో టిడిపికి దగ్గరవుతున్నారని అనుమానం పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.

గతంలో జగన్ పవన్ ఒకటి అంటూ విమర్శించే టిడిపి నేతలు ఇప్పుడు పవన్ ను విమర్శలు లిస్ట్ నుండి తొలగించారు. టిడిపి, వైసిపి పై కొద్ది రోజుల వరకు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్. కొద్ది రోజులుగా విమర్శలు దూరంగా ఉన్నారు. విజయవాడ గుంటూరు లో పర్యటనలు పరోక్షంగా జగన్ పై విమర్శలు చేశారు. ఇక టిడిపి నేతలు తనపై విమర్శలు జోలికి వెళ్లటం లేదు. పవన్ ఎప్పటికైనా తమతో కలుస్తారని టిడిపి నేతలు ఇంకా నమ్మకంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్ అంటరానె చర్చ మొదలైంది. వామపక్షాలు తో జత కట్టిన పవన్ వారిని కాదని టిడిపితో కలిసి వెళ్లే ప్రసక్తి ఉండదని కొందరు విశ్లేషణ. పవన్ టిడిపి ఒత్తిడికి లొంగి తార లేక ఇప్పటికే చేసిన ప్రకటన మీద నిలబడతారా చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *