చంద్రన్న పాపాలు- అమరావతి శాపాలు

చంద్రన్న నాలుగేళ్లు పాలన సాగించిన సచివాలయానికి ఒక్క సరైన రోడ్డు లేదు అంటే నమ్ముతారా? ఇది ముమ్మాటికీ వాస్తవం. మాస్టర్ ప్లాన్ సిద్దమైన తరువాత రోడ్లు,ఇతర అవసరాలు శేత్రస్థాయిలో చూపించి కచ్చా రోడ్లు ఏర్పాటు చేసుకొని మొక్కలు నాటి పచ్చదనం, చల్లదనం కలిగేటట్టు చెయ్యడం పెద్ద పని కాదు, ఖర్చుకూడా అతితక్కువలో అయిపోతుంది. చంద్ర పారాయణ బృందం నారాయణ జపం చేయటము తప్ప ఇటువంటి పనిచేసిన దాఖలాలు ఎక్కడా అమరావతిలో భూతద్దంపెట్టి వెతికినా కనిపించవు. కాగితాలపై బొమ్మలు గీచి కార్నర్ ప్లాట్స్ , మంచి కూడళ్లలో ప్లాట్స్ అనుకూలవర్గాలకు వచ్చేటట్టు పడ్డ తాపత్రయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టివుంటే అమరావతికి ఈనాటి గతి పట్టివుండేదికాదు.
ప్రారంభించిన ఒక్కటి, రెండు రోడ్డులు భూసేకరణ జరగక ఆగిపోవడం యాదృచ్చికమా, చంద్రన్న చేతకానితనమా? విజయవాడనుండి, మంగళగిరి నుండి, నేషనల్ హైవేనుండి సచివాలయానికి 4 లైనుల రోడ్డులు కనీసావసరం అని అప్పటి పాలకులకు తెలియదా? ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ పోరాటం అంటూ కాలంగడిపి దోసుకొన్నది దాసుకోవడంలో మునిగిపోయి, శేత్రస్థాయి పనులను విస్మరించి ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి ప్రయోజనం. పాలకుల తప్పులకు ప్రజలెందుకు శిక్ష అనుభవించాలి?
హైదరాబాద్ కట్టాను, సైబరాబాద్ నాదే, బాహ్య వలయ రింగ్ రోడ్డు నేనే నిర్మించాను, పోలవరం నాదే, పట్టిసీమ నాదే , ఆదినాదే , ఇది నాదే అంటు ఉన్నవి లేనివి కోసే చంద్రన్నకు ఊహలలో అమరావతి నిర్మించడం పెద్ద విషయం కాదు. ఇదేమన్నా కొత్తిమీర కట్టా , ఒంగోలు జాతి ఆవా కట్టించడానికి. ఆయన ఏదో కూస్తున్నాడు సరే , ఆ కూతలను నిజమని నమ్మి ఆ భ్రమలో జీవిస్తున్న తెలుగు తమ్ములను , భ్రమరావతి మానసపుత్రులను ఏమనాలి. హాట్స్ ఆఫ్ చంద్రన్న భజనబృందాల సృష్టిలో నీకు నివ్వే సాటి.
నీ దురదృష్టమో ,ఆంధ్ర ప్రజల అదృష్టమో పాత వ్యవహారాల దుమ్ముదులిపి , దమ్మురేపి , దుక్కిదున్ని ధనరాశులు పండించే ముఖ్యమంత్రి వచ్చారు. రివెర్స్ టెండరింగ్ విధానంతో వేలకోట్లు ఆదాచేసి , నాణ్యమైన పనులు ఎలా తక్కువ ఖర్చుతో చేయవచ్చో చూపించి, చంద్రన్న భాజాభజంత్రీల బాక్స్ బద్దలయేటట్టు చేసే రోజు దగ్గరలోనే వుంది.
అమరావతి ప్రక్షాళన కూడా అందులో ఒకభాగమే. రాజధాని ప్రాంత ప్రజలు చంద్రన్న చదరంగంలో పావులుగా మారకుండా, గతప్రభుత్వ అమరావతి అక్రమాలను వెలికితీయడంలో సహకరించి జగన్మోహన్ రెడ్డిగారిని నమ్ముకుంటే తప్పక మంచి జరుగుతుంది.