బ్యాంకు పోస్టల్ డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై పన్ను పరిమితి పెంపు

పోస్టల్ బ్యాంకు డిపాజిట్ల పై వచ్చే ఆదాయంపై టిడిఎస్ పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. ఆదాయపన్ను పరిమితి ప్రస్తుతం 10,000 గా ఉంది.

పోస్టల్ ,బ్యాంకు డిపాజిట్ల పై ,వచ్చే వడ్డీ పదివేలు దాటితే పన్ను చెల్లించాల్సి వచ్చేది.

ఈ పరిమితిని 40 వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది ప్రభుత్వం.సీనియర్ సిటీనులు ,మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వడ్డీని పొందుతూ ఉంటారు. వడ్డీ ఆదాయం ద్వారానే అవసరాలు తీర్చుకుంటుంటారు.

వడ్డీ ఆదాయం పదివేల రూపాయలు దాటితే పన్ను చెల్లింపులు తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దీని గమనించిన కేంద్రం ఈ సారి ఊరటనిచ్చింది. పన్ను పరిమితిని 40 వేలకు పెంచింది.

దీనివలన సీనియర్ సిటిజన్స్ ,గ్రామీణ, మధ్యతరగతి ,ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

బ్యాంకు ,ఫిక్స్డ్ డిపాజిట్లలో, పోస్ట్ ఆఫీస్ లోని వివిధ స్క్రీన్స్ లో డిపాజిట్లు పెరగనున్నాయి.వాణిజ్య బ్యాంకుల పోటీని తట్టుకునేందుకు తపాలా శాఖ కసరత్తు చేస్తోంది.

ఖాతాదారులను పెంచుకోవడం .వారికి మెరుగైన సేవలు అందించడం కోసం ఆ శాఖ పనిచేస్తుంది. బ్యాంకుల కంటే ఎక్కువ సేవలను అందించేందుకు కొత్త పథకం పెట్టింది.

నగదు రహిత లావాదేవీలు పెంచాలని భావిస్తోంది. ఇండియా పోస్ట్ సేవింగ్స్ బ్యాంక్స్ పేరుతో విస్తృత సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.

ఇంతకాలం ఉత్తరాల బట్వాడా, భీమా ,పింఛన్లు, ఉపాధి ,కూలీల డబ్బు ,చిన్న మొత్తాల పొదుపు, తదితర సేవలను అందిస్తున్న తపాల శాఖ ఇకపై పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలు అందించనుంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించాలని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు సరైన సౌకర్యాలు లేవు గ్రామీణ ప్రాంతాల వారికి సరైన అవగాహన లేదు.

దాంతో కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ను ఏర్పాటు చేసింది.

పల్లెలకు విస్తరణ, మారుమూల పల్లెల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయనుంచి పట్టణాలు పెద్ద పెద్ద కార్యాయలయలొ బ్యాంకు సేవలను ఈ ఏడాది సెప్టెంబర్ 1నుంచి అందిస్తున్నారు. నగదు రహిత సేవలను అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *