కేరళ కుట్టి సుమకు అరుదైన ఘనత

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరు అంటే టక్కున సుమ అంటారు. తన మాటల చాతుర్యంతో గత రెండు దశాబ్దాలుగా సినీ, టెలివిజన్ రంగంలో అత్యద్భుతంగా రాణిస్తున్నారు.
యువ యాంకర్ల కి దీటుగా తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో తో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఏకదాటిగా పదకొండేళ్లుగా స్టార్ మహిళ
స్టార్ మా లో ప్రసారమయ్యే స్టార్ మహిళ కార్యక్రమానికి సుమ ఏకైక వ్యాఖ్యాత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిస్తున్నారు.
ఈ కార్యక్రమం 2008 ఆగస్టు 9న మొదలయింది. దేశంలోనే అతి సుదీర్ఘంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇది. ఇది టెలివిజన్ రంగంలోఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు.
మూడువేల ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఒకే ఒక్క కార్యక్రమం. ఇన్ని వేల ఎపిసోడ్స్ కొనసాగడం నిజంగా అభినందనీయం.
ఈ షో కి ఇంత మంచి రేటింగ్ రావడానికి ముఖ్యంగా సుమ యాంకరింగ్ కారణమని చెప్పుకుంటారు.