జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్.ఏ.ఐ చేతికి ఏపీ హైకోర్టు ఆదేశం… ‘బాబుకి తొలి షాక్’

ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఏపీలో ప్రధాన పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును విచారణకు ఎన్ఐఏకి అప్పగిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు పై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కోర్టు దర్యాప్తు ఆలస్యమైతే సాక్షాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాల హైకోర్టు గతంలో ని అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఏన్ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చి చెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్ఐఏ విచారణకు అంగీకరించింది. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్ఐఏకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అతి కీలకమైన కేసుగా దీన్ని పరిగణించడమే కాకుండా జగన్ తరపు పిటిషనర్లు కోరినట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థం కు అప్పగించడం నిజంగా ఏపీ ప్రభుత్వానికి దెబ్బ లాంటిదే. అసలు జగన్ పై జరిగిన హత్య యత్నం కేసులో ఆయన్ని కనీసం ఫోన్లో సైతం పరామర్శించకుండా ఈ కేసును నిరాకార్చేందుకు చంద్రబాబు సర్కార్ చేయని ప్రయత్నం లేదు.

ఇక జగన్ ను తనంతట తానే హత్యాయత్నం చేయించుకుని సానుభూతిని పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చంద్రబాబు తో సహా , టీడీపీ మంత్రులంతా ఘాటైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత సంవత్సరం అక్టోబర్ 26న విశాఖ విమానాశ్రయం లో జరిగిన . ఈ ఘటన జాతీయవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చంద్రబాబు సర్కారు మాత్రం ఏం కాలేదన్నట్లుగా నే వ్యవహరిస్తూ వచ్చింది. సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే బాధ్యత కలిగిన డీజీపీ ఇది జగన్ అభిమాని చేసిన చిన్న దాడి అంటూ కేసును బలహీన పరిచేందుకు మొదటి రాయి వేశారు. మరి, అంత అంత పగ్గపట్టినట్లుగా. ఈ కేసు విషయంలో ప్రభుత్వం యత్నంచడమే కాదు, తాము చెప్పిందే నిజం అన్నట్లుగా దర్యాప్తును సైతం అదే విధంగా అపహాస్యం చేస్తూ వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా నియమించిన సిట్ సైతం ప్రభుత్వ పెద్దల చిలక పలుకులే పలుకుతూ ఈ కేసును ముందుకు తీసుకు పోకుండా చూస్తూ వచ్చింది.

ఇక రెండు రోజుల్లో హైకోర్టు తీర్పు వస్తుందనగా హడావుడిగా విశాఖ నగర పోలీసు, కమిషనర్ హేమచంద్ర లడ్డా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ కేసును ప్రచారం కోసమే నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేశారంటూ పాత పాటనే వలించారు. ఈ కేసులో అంతకంటే మరేమీ లేదన్నట్లుగా ముక్తాయింపుఇచ్చారు. ఇంత జరిగినా కూడా హైకోర్టు ఇప్పుడు దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో చంద్రబాబు సర్కార్ కు ఇరకాటం తప్పేట్లు లేదు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కూలంకషంగా విచారణ జరపనుంది. దాంతో వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా విమానాశ్రయంలో నిందితుడు శ్రీనివాస్ ఎలా ప్రవేశించారు, అతనికి సహకరించిన వారు ఎవరు అక్కడ టీడీపీ నాయకుడు రెస్టారెంట్ లో ఎలా ఉద్యోగం సంపాదించాడన్న దానితో పాటు. ఈ హత్యాయత్నం వ్యూహం వెనుక అసలు సూత్రధారి పాత్రధారి ఎవరన్నది వెల్లడి కావచ్చునని అంటున్నారు.

జరిగింది ఇది

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోని వీవీఐపీ లాంచ్ లో అక్టోబర్ 25న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పక్కనే ఉన్న ప్యూజన్ పుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రక్షణ శాఖకు చెందిన తూర్పు నావికాదళం పరివేక్షణ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ దారుణ ఘటన వెనక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్ర మొదలు అన్ని రాజకీయ పక్షాలు అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్ పోర్ట్ భద్రతను పరిచే పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎన్ఎఫ్) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరాట పడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు డీజీపీ ఠాకూర్, మంత్రులు టీడీపీ నేతలు తలోవిధంగా మాట్లాడారు.

వైఎస్ జగన్ పై సానుభూతి కోసంమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాత ంగా విచారణ నిర్వహించాలని వైఎస్సార్ సీపీ న్యాయస్థానాన్ని కోరింది హైకోర్టు ఆదేశాలతో కేంద్రం డిసెంబర్ 31న ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసింది . హోంశాఖ అదేశాలతో హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన విచారణ అధికారిగా మహ్మద్ సాజిద్ ఖాన్ ను నియమించారు. విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్ పై హత్యాయత్నం కేసు ను ఎన్ఐఏకు బదలాయించినట్టు ఏపీ హైకోర్టు కు కేంద్రం తెలిపింది.

1 thought on “జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్.ఏ.ఐ చేతికి ఏపీ హైకోర్టు ఆదేశం… ‘బాబుకి తొలి షాక్’

  1. ఆప్యాయంగా నేరగాడి భుజాల మీద చేతులు వేసుకుని నడిపిస్తూ, స్టేషన్ లో హాయిగా కూర్చోబెట్టి బిర్యానీలు వడ్డిస్తూ, పదిహేను రోజులపాటు కస్టడీలో ఉన్నా కూడా నోట్లోంచి ఒక్క నిజాన్ని కూడా కక్కించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తుకు, నెత్తిన ముసుగేసి, పెడరెక్కలు పట్టుకుని ఈడ్చుకెళ్తూ చూపరులకు కూడా భయభ్రాంతులు కలిగేట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చేస్తున్న దర్యాప్తుకు స్పష్టమైన తేడా కనిపిస్తున్నది.

    ఆంధ్రప్రదేశ్ లో దర్యాప్తు చెయ్యడం క్షేమదాయకం కాదని శ్రీనివాసరావును తెలంగాణ తీసుకెళ్లడం, రేపో మాపో ముంబయి, ఢిల్లీ కూడా తీసుకెళ్లి నిజాలు కక్కించే సూచనలు గోచరిస్తుండటం చూస్తుంటే, కోడికత్తిగాడిని ఆ సంస్థ ఎంత సీరియస్ గా తీసుకున్నదో అర్ధం చేసుకోవచ్చు.

    జగన్ మీద హత్యాయత్నం వెనుక ఉన్న శక్తులను త్వరలో జాతీయ దర్యాప్తు సంస్థ వెలికి తీస్తుందని ఆశించడం కన్నా మనం చెయ్యగలిగినది ఏమీ లేదు.

    కాగా, నిన్నటి చంద్రబాబు ప్రకటనను చూస్తుంటే, ఈ కేసు దర్యాప్తు ను చూసి ఆయన భయపడిపోతున్నట్లు తేలిపోతుంది. ఎన్నైఎ దర్యాప్తును ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆత్మగౌరవ సమస్యగా చిత్రీకరించడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఆయన భయవిహ్వలుడు అవుతున్నాడని భావించక తప్పదు. మొన్న ఎమ్మెల్యే కిడారి హత్యను ఎన్నైఎ చేపడితే, చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు మరి!

    ఎన్నైఎ నిందితుడినించి నిజాలు రాబట్టినా రాజకీయశక్తులు వాటిని బయటకు రాణిస్తాయా అనేది ప్రశ్న. ఈలోపలే రాజకీయ అవగాహనలు కుదిరితే ఆ నిజాలు బయటకు రావేమో? ఎందుకంటే, మోడీ, చంద్రబాబు ఇద్దరూ అవకాశవాదులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *