కొత్తగూడెం: విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్‌కు ఆమె తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాల్.. కూతురు లాంటి ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కొంత కాలంగా ఓ విద్యార్థిని లైంగికంగా హింసిస్తున్నాడు.

వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక పాఠశాలకు వెల్లడానికే వణికిపోతోంది. తన తల్లిదండ్రుల వద్ద గోడు వెల్లబోసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లి ఆ కీచకుడికి దేహశుద్ధి చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బుధవారం (ఫిబ్రవరి 20) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

దమ్మపేట మండలం రాచూరిపల్లికి చెందిన ఓ విద్యార్థిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూల్ ప్రిన్సిపల్ కొన్ని రోజులుగా ఆ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు.

వేధింపులు తీవ్రమవడంతో విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపల్‌ను చితకబాదారు.

సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారునిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు సర్దిచెప్పి పంపించారు.

ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సదరు ప్రిన్సిపల్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని, అతణ్ని వెంటనే తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *