ఇక ఏపీ లో నిర్ధేశించిన బరువు కన్నా ఎక్కువ ఇసుక ఉంటే రెండు వేలు ఫైన్ విధించనున్నారు.

ట్రాక్టర్ లో ఇసుక అక్రమంగా తరలిస్తూ చిక్కితే మొదటి సారి 10 వేలు, రెండవ సారి 20 వేల జరిమానా విధించనున్నారు.
10 చక్రాల లారీ అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే తొలిసారి 25 వేలు, రెండవ సారి 50 వేలు జరిమానా విధించనున్నారు.
10 కంటే ఎక్కువ చక్రాలుండే లారీ పట్టుబడితే తొలిసారి 50 వేలు, రెండవ సారి లక్ష రూపాయలు జరిమానా విధించనున్నారు.
ఇసుక అక్రమంగా తవ్వుతు యంత్రాలు దొరికితే తొలిసారి 50 వేలు, రెండవ సారి లక్ష రూపాయల జరిమాన విధించనున్నారు.
ఇసుక అక్రమార్కుల నుంచి ప్రజలను కాపాడి, ప్రజలకు తక్కువ రేటుకే ఇసుకను ఇవ్వడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమైతే సీఎం జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేటి నుంచి ఇసుక కొత్త విధానం రానుండటంతో పాటు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణ జిల్లా చెవిటికల్లు స్టాక్ పాయింట్ లో నేడు ఇసుక నూతన విధానాన్ని ప్రారంభిస్తారు. ఇసుక బుకింగ్ కు సంబంధించి నూతన వెబ్సైట్ ను కూడా ఆవిష్కరించనున్నారు. టన్ను ఇసుక ధరను 375 రూపాయలుగా నిర్ణయించారు.