అయ్యయ్యో, జగన్ అంటే ఎవరో! తెలియదు అట, ఆర్జీవీకి…

ఆర్జీవి తెరకెక్కించిన కొత్త సినిమా,’లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఈ సినిమా ప్రమోషన్ కోసం రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పబ్లిసిటీ హంగామా అంతా ఇంత కాదు..’లక్ష్మిస్ ఎన్టీఆర్’ నిర్మాత ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఆర్జీవి, అదే ఫోటోలో ఉన్న జగన్ గురించి ప్రస్తావిస్తూ.. జగన్ అనే వ్యక్తి ఎవరు తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా డైలాగ్ లు తో పాపులర్ అవుతు ఉండడం కొంతమంది హీరోయిన్లు కూడా చెందుతుంది. ఆ మధ్య ప్రభాస్ ఎవరో తెలియదు అంటూ అప్పట్లో ఓ సీన్ క్రియేట్ అయ్యింది. ఈ కోవలోకి చెందిన రాజకీయ నేతలు, మాజీ కేంద్ర మంత్రి.. టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చాలాసార్లు తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని చెప్తూ ఉంటారు. దీనిపై మన పవన్ కళ్యాణ్ సెటైర్ లు వెయ్యడం కూడా మామూలే. ఇక విషయానికి వస్తే.

ఇక వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేయడమే ఆలస్యం… నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు… ఒకరేమో వర్మ జోకేశాడు నవ్వండి. అంటూ.. మరికొందరేమో… వర్మ చమత్కారానికి పడి పడి నవ్వేస్తున్నారు.. ఇంకొందరేమో ఈ సినిమాతో వైయస్ఆర్సీపీ ని కూడా కెలికేసి పండగ చేసుకుందాం అనుకుంటున్నారని పడార్థాలు కూడా తీశారు.

రాంగోపాల్ వర్మ సాక్షి ఛానల్ లో ఇంటర్వ్యూలు చూస్తూనే ఉన్నాము.. అసలు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తీయాలి అని ఆలోచన వచ్చినప్పుడే ముందుగా వైయస్ జగన్ ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు అసలు హైలెట్ ఏంటంటే వైఎస్ఆర్ సీపీ నేత రాకేష్ రెడ్డి నే నిర్మాత. సో,వైఎస్సార్సీపీని కెలికే ఉద్దేశం అయితే లేకపోవచ్చు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *