జనసేన పార్టీలోకి మహిళా అధ్యక్షురాలుగా ఎంట్రీ ఇస్తున్నారు రేఖ

అమరావతి: జనసేన మహిళా విభాగాల సారథులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్ణయించారు.

జనసేన వీర మహిళా విభాగం అధ్యక్షురాలిగా సీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న రేఖ జవ్వాజికి బాధ్యతలు అప్పగించారు.

ఈ కమిటీలో నలుగురు ఉపాధ్యక్షులున్నారు. కనుమూరి కవిత సింధూరి (భీమవరం), షేక్ జరీనా (నరసరావు పేట), నూతాటి ప్రియా సౌజన్య ( రాజమ హేంద్రి ), జి శ్రీ వాణి (హైదరాబాద్) నియమితులయ్యారు.

అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వీర మహిళా కన్వీనర్లు ,కో కన్వీనర్లు, కోఆ ర్డినేటర్లను కూడా నియమించారు.

పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజాత పాండాను నియమించారు.

పాలసీ వింగ్ చైర్మన్ గా కంబాల యామినీ జ్యోత్స్మను నియమించారు.

పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ లు, వర్కింగ్ కమిటీల్లోనూ మహిళకు చోటు కల్పించారు.

పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పెద్దశెట్టి ఉషశ్రీని నియమించారు. పార్టీ ఐడియాలజీ వింగ్ , సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటయ్యాయి.

వీటితోపాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజా ప్రయోగ కౌన్సిళ్లు , కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలివిడతగా 22 మహిళా విభాగాలకు చోటు కల్పించారు.

పార్టీ కోసం పని చేస్తే మద్దతుగా నిలిచి వారికి సముచిత స్థానం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.ఆ విద్యార్థులు విడుదల చేయించాలి:

అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలని పవన్ కోరారు.

అరెస్టయిన వారిలో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నట్లు వార్తలు రావడం బాధ కలిగిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *