రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. టీడీపీకి ఓటేసినట్లు రెబల్ ఎమ్మెల్యే వెల్లడి..

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే భారీ ట్విస్ట్ ఇచ్చారు. తాను టీడీపీకి ఎందుకు ఓటేయాల్సి వచ్చిందో చెప్పారు.

రాజ్యసభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో తన ఓటును టీడీపీ నిలబెట్టిన వర్ల రామయ్యకు వేసినట్లు వెల్లడించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్యే మద్దాలి గిరి సూటి ప్రశ్నలుసంధించారు.

గెలవమని తెలిసి కూడా వర్ల రామయ్యకు ఎందుకు టిక్కెట్ ఇచ్చారని, గెలిచే సమయంలో వర్ల రామయ్య గుర్తుకు రాలేదా? అని గిరి ప్రశ్నించారు.

తనకు తెలుగు దేశం పార్టీ నుంచి ఎలాంటి విప్ అందలేదని, కానీ దళితుడన్న గౌరవంతో వర్ల రామయ్యకే ఓటేసినట్లు మద్దాలి గిరి వెల్లడించారు.

అలాగే చంద్రబాబు తన పక్కనున్న బ్యాచ్‌ను పక్కన పెడితే బెటర్‌ అని మద్దాలి గిరి సూచించారు.

ఇప్పటికైనా చంద్రబాబు పార్టీపై దృష్టిపెడితే మంచిదని సలహా ఇచ్చారు. ఆయనకు ఓపిక లేకపోతే.. అధ్యక్ష పదవిలో నారా లోకేష్‌నైనా కూర్చోబెట్టాలని గిరి సూచించారు.

గతంలో తులాభారం వేసి చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారని, ఇప్పుడు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

అందుకే పోలింగ్ ఏజెంట్‌గా కూడా టీడీపీ ఎమ్మెల్యే లేరని మద్దాలి గిరి ఎద్దేవా చేశారు.

టీడీపీకి 17 ఓట్లు మాత్రమే పడ్డాయని చెప్పారు. తనకు ఎలాంటి విప్ అందలేదని స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్లీ ఓటేయమనడం ఏంటని చంద్రబాబును ప్రశ్నించారు. తనను స్పీకర్ ప్రత్యేక సభ్యునిగా గుర్తించారని మద్దాల గిరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *