‘రెడీ టు ఫ్లై’.. మనసులో మాట చెప్పిన అభినందన్…

వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెబుతుంటే.. అభినందన్ మాత్రం ఆదివారం తన మనసులో మాట బయటపెట్టారు. తనను త్వరగా పంపిస్తే తిరిగి విధుల్లో చేరతానన్నారట.

1.అభినందన్‌‌కు చిన్న, చిన్న గాయాలయ్యాయి
2.మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
3.మిలటరీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో అభినందన్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ మిలటరీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

వైద్యుల పర్యవేక్షణలో అభినందన్‌కు పరీక్షలు నిర్వహించి.. చిన్న, చిన్న గాయాలైనట్లు తేల్చారు. స్థానికులు దాడి చేయడంతో ఈ గాయాలు తగిలాయంటున్నారు. మరికొన్ని రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమంటున్నారు డాక్టర్లు.

వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెబుతుంటే.. అభినందన్ మాత్రం ఆదివారం తన మనసులో మాట బయటపెట్టారు.

తనను త్వరగా పంపిస్తే తిరిగి విధుల్లో చేరతానన్నారట. ఈ విషయాన్ని భారతవాయుసేన అధికారులు తెలిపారు.

అభినందన్ చెప్పిన ఈ మాట విని అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. మళ్లీ ఉరకలేసే ఉత్సాహంతో విమానం నడిపేందుకు సిద్ధమైన వింగ్ కమాండర్‌ను ప్రశంసిస్తున్నారు.

మూడు రోజుల క్రితం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను తరుముకుంటూ అభినందన్ మిగ్ 21 విమానంలో వెళ్లారు. విమానం క్రాష్ కావడంతో పాక్ భూభాగంలో ప్యారాచూట్ సాయంతో దిగారు.

అక్కడ ఆర్మీ అభినందన్‌ను బందీగా అదుపులోకి తీసుకుంది. ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు, జెనీవా ఒప్పందానికి తలొగ్గి పాక్ వింగ్ కమాండర్‌ను శుక్రవారం భారత్‌కు అప్పగించింది.

వాఘా సరిహద్దులో అభినందన్‌ను భారత్‌కు అప్పగించగా.. ఆయన్ను ఢిల్లీలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *