రాఫెల్ పై కొత్త ఫొటోలు పుట్టుకొస్తున్నాయ్…. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

రాఫీల్ డీల్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోజుకో కొత్త విశయాన్ని బయటికి తీసుకురావడం.. తద్వారా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పనిగా పెట్టుకొన్నాడు.

ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్ పై కొత్త ఫోటోలు పుట్టుకొస్తున్నాయ్. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని పదితలలతో కూడిన రావణుడిగా చూపుతూ ఏర్పాటైన పోస్టర్‌ కలకలం రేపుతోంది.

రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో పాలక బీజేపీని దోషిగా చూపుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. రఫేల్‌ విమానంపై ప్రధాని మోదీ ఫోటోను చూపుతూ ‘ కాపలాదారే దొంగ’ అనే క్యాప్షన్‌ను పొందుపరిచారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్ధానిక నేతలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలావుండగా.. ఓ వైపు రాఫెల్ డీల్ పై మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే .. వచ్చే ఎన్నికల్లో రైతులు, కార్మికులు,శ్రామికులని ఆకట్టుకొనే పథకాలు ప్రకటిస్తున్నారు రాహు.

మొత్తానికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మరీ.. ఆ వ్యూహం ఫలించి వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *