ఒక రాజధానిగా విశాఖపట్నం వాసులకు లేని ప్రేమ నీకెందుకు జగన్?

హైకోర్టు తమ ప్రాంతం లో పెట్టనీయకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు పై ఆ ప్రాంత వాసులకు లేని కోపం నీకెందుకు జగన్.,..?
ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఎప్పుడైనా అమరావతి ప్రాంత వాసులు లాగా తమకే అన్నీ కావాలని రోడ్డు ఎక్కారా…? టెంట్ వేశారా….? ఉద్యమాలు చేశారా….?
వాళ్ళ ప్రాంతం పై వారికి లేని మోజు నీకెందుకు….?
మీకెందుకు హైకోర్టు , హైకోర్టు ను అమరావతి లో పెట్టడానికి మీరు సహకరించండి అని అనంతపురం లో జోళె పట్టడానికి వచ్చిన చంద్రబాబు ను రాయలసీమ వాసులు అడ్డుకున్నారా….? మీకెందుకు హైకోర్టు…?
విశాఖపట్నం వాసులు రాజధానిని కోరుకోలేదు.వారికి రాజధాని వద్దు,అన్నీ అమరావతి లోనే ఉండాలని వైసిపి తప్ప మిగతా అన్ని పార్టీ లు రోజూ కోడై కూస్తుంటే ఆ ప్రాంత వాసులకు కనీసం చీమైనా కుట్టినట్లు లేనపుడు నీకెందుకు జగన్ ఆ ప్రాంతం పై ప్రేమ.
అధికార,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలి అనే వాడికి నోరు లేదు.
అన్నీ మాకే కావాలి.అమరావతి మరో హైదరాబాదు కావాలి.మీకెందుకు హైకోర్టు,మీకెందుకు పరిపాలనా రాజధాని అనే వాడి నోరు పెద్దది.వాడేమైనా చేయగలడు.వాడికి మెజారిటీ ప్రజల బాగోగులతో సంబంధం లేదు.తన ప్రయోజనాలే ముఖ్యం.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎందుకు వెనుక బడ్డాయో ఈ ముప్పై రోజుల రచ్చ ద్వారా తెలిసిపోతోంది.
మేము అంతే,మా బతుకులు అంతే.మేము శాప గ్రస్తులం.తెదేపా,భాజపా,జనసేన,ఉభయ కమ్యూనిస్టు పార్టీ ల దృష్టి లో మేము పూజకు పనికిరాని పువ్వులం.పూచిక పుల్లకు కొరగాని అధములం.
అయినా: సిగ్గు,శరం లేని జనాలం గదా మేము.మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు లే…
#RipRayalaseema #RipUtharandhra
Source : Muni Shekar Duvvuru
గోవిందరెడ్డి ఉప్పలపాటి, ప్రకాష్ & సభ్యులు - వైయస్సార్ సిపి సిడ్నీ విభాగం, ఆస్ట్రేలియా