కుల రాజకీయాలు చుట్టూ పవన్….

power star

ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా కేవలం వారి కులం ఓట్లు ఉంటే సరిపోవు కదా…పవన్ కుల రాజకీయం.. గమనిస్తున్న ప్రజలు.

అలాగని కులాలకతీతంగా ఏ పార్టీ నాయకులూ రాజకీయాలు నడపలేరు. తమ వర్గాన్ని కాపాడుకుంటూనే ఇతర వర్గాల అభిమానం సంపాదించాలనుకుంటారు. ఈ విషయం పవన్ కల్యాణ్ కి కూడా తెలుసు. అందుకే కులరాజకీయాలకు తెరతీశారు.

నాది ఏ కులం కాదు, అంటూనే కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. నేను అందరివాడిని అంటూనే కొందరినే చేరదీస్తున్నారు. రెడ్డి అంటే రక్షించేవాడే కానీ దోపిడీ చేసేవాడు కాదు అంటూ కర్నూలు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు రెండు పార్టీలు అండగా ఉన్నాయి.మరి ఆ రెండింటిలో కేవలం రెడ్డి వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని పవన్ మాట్లాడటాన్ని ఎలా పరిగణించాలి.

ఎవరికి మద్దతుగా, ఎవరి కోవర్ట్ గా పవన్ రాజకీయాలు చేస్తున్నారనుకోవాలి. ఈ మీటింగ్ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలామంది పవన్ ని విమర్శించడం మొదలు పెట్టారు.

దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన పవన్, నరసరావుపేట సభలో నేను రెడ్డి కాదు, నాయుడు కాదు, రాయల్ కాదు అంటూ కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు.

తన పేరు చివర ఏ పేరునీ పెట్టుకోనని, తాను కులాలను విడదీస్తూ రాజకీయం చేయడంలేదని, కులాలను కలుపుతూ రాజకీయం చేస్తున్నానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.

తన నలుగురు పిల్లల్లో ఇద్దరు హిందూ సంప్రదాయాలను, ఇద్దరు క్రైస్తవ సంప్రదాయాలను పాటిస్తారని చెప్పారు. తనకు కులాలు, మతాల మకిలి అంటించొద్దని అన్నారు.

అయితే పవన్ కల్యాణ్ మాటల్లో ఎంత వాస్తవం ఉందనేది ప్రజలందరికీ తెలుసు.

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఏ వర్గానికి ‘కాపు’కాచిందనేది జగమెరిగిన సత్యం. చిరంజీవి చుట్టూ ఉన్న నిర్మాతలు, దర్శకులు ఏవర్గం వారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రజారాజ్యంలో ఏ వర్గం ప్రాబల్యం ఉందీ, జనసేనలో ఏ కులం నాయకులు ఎక్కువగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం.

వీటన్నిటినీ కాదని, పవన్ కల్యాణ్ నీతివాక్యాలు, చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. దీనికితోడు రెడ్డి వర్గంపై ఆయన విమర్శలు చేయడం మరింత విడ్డూరం.

కులరాజకీయాలకు దూరం అంటూనే పవన్ కులాల వారీగా ఓట్లను చీల్చే పనుల్లో బిజీగా ఉన్నారు.

కనీసం ఒక వర్గం ఓట్లయినా సంపాదించాలని, నాలుగు జిల్లాల్లో తన సత్తాచూపాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి పవన్ చర్యలు కు ప్రజలు స్పందిస్తారో లేదో? వేచి చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *