అప్పుడు వద్దన్న పార్టీలే ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాయి అంటున్న పవన్ కళ్యాణ

జనసేన కు తగిన సంఖ్యలో సీట్లు రావని గతంలో చెప్పిన వారే వచ్చే ఎన్నికల్లో కలిసి రావాలంటూ తమ్మను ఆహ్వానిస్తున్నారని. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు, ఇందుకు సంబంధించి తెరాస నాయకులతో కూడా మాట్లాడిస్తున్నారని ఆయన చెప్పారు, ప్రజల్లో తమ పార్టీ కున్నబలానికి ఇదే నిదర్శనం అన్నారు, రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయాలతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని అందుకు జనసేన ఆవలంబనగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు, ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి జనసేన లోకి వచ్చే నేతలను మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సమయం ఆసన్నమైనది నా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు జిల్లా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు, ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకునేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కు మద్దతు పలికితే ఆ పార్టీ కూడా నేడు అవినీతిలో కూరుకు పోయిందని విమర్శించారు, 25 కిలోల బియ్యం అక్కర్లేదు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండని రాష్ట్రంలోని యువత కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు మనం కోల్పోతామని తనను ఎవరు ఎన్ని తిట్టినా దిగజారి విమర్శలు చెయ్యను అని అన్నారు, తమ పార్టీలో కొత్త నాయకులు చేరిన ముందు నుంచి పనిచేస్తున్న జనసైనికులు వెన్నెముక లాంటి వారిని వారి సేవలను పార్టీ తప్పక గుర్తిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు, జనసేన పార్టీ కి సామాన్యుడి టీ గ్లాసు ఎన్నికల గుర్తుగా రావడం అనుకూలించే విషయం అన్నారు, తనకు చిన్ననాటి నుంచి తేనీరు అంటే ఎక్కువ ఇష్టం అని ఇప్పుడు అదే టీ క్లాస్ పార్టీ గుర్తు గా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *