జగన్ CM కాకూడదు కానీ జగన్ మీద నాకు ప్రత్యేకమైన కోపం ఏమి లేదు – చిత్తూర్ లో పవన్

నేను CM కావాలి అని కోరుకుంటే తప్పు లేదు కానీ పక్కనోడు CM కాకూడదు అని కోరుకోవడం హేమిటో ?

జగన్ మీద కోపం లేనప్పుడు ఎందుకు CM కాకూడదు అని అనుకొంటున్నావు?? బాబు కు మాత్రం ఆ మినహాయింపు ఎందుకో?

సర్వే ల ప్రకారం గోదావరి జిల్లాల్లో 15 శాతం, రాష్ట్రం మొత్తం చూస్తే 5 -10 శాతము ఓట్లు జనసేన కు వస్తాయి అని తెలుస్తోంది

2014 లో నేను టీడీపీ కి సపోర్ట్ చేయకపోయి ఉంటె అప్పటి ప్రజల అభిప్రాయం ప్రకారం జగన్ సీఎం అయ్యేవాడు , టీడీపీ కి మద్దతిచ్చి తప్పు చేశాను అని కొంత కాలం క్రితం నీవే చెప్పావు అంటే నీవంటే ఇష్టపడే ఒక వర్గం యువత తో ప్రజాభిప్రాయం ప్రకారం గెలవాల్సిన జగన్ ను ఓడించావు అని నీవు ఒప్పుకున్నట్టే .

ప్రజాస్వామ్యం అని గొంతు చించుకొని అరిచే నీవు ప్రజల అభిప్రాయాన్ని నీ కున్న సినీ గ్లామర్ తో మార్చడం తప్పు కాదా?

భారత దేశ రాజకీయాల్లో జగన్ కష్టపడినతంగా ఎవరూ కష్టపడలేదు అని కాంగ్రెస్ నాయకుడు ,సుప్రీం కోర్ట్ లాయర్ జంధ్యాల రవి శంకర్ ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు.
అటువంటి నిరంతర బాటసారి సీఎం అయితే తప్పేంటి?

పవన్ నీవు ఎదగాలనుకోవడం లో తప్పు లేదు కానీ ఇంకొకరు ఎదగకూడదు అనుకోవడం కుళ్ళు అవుతుంది.

నీవే చెప్పావు బాబు చిన బాబు ల దోపిడీ అంతా ఇంతా కాదు అన్నీ ఒక కులానికే దోచి పెడుతున్నారు అని , మరిచిపోయావా ?

సరే బాబు నీకు ఏమి ఇస్తునాడో తెలీదు కానీ బాబు కులస్థుల మీడియా నీకు ఇస్తున్న ప్రచారం చూస్తేనే తెలుస్తోంది నీవు ఎవరి మనిషివో?

కడప గోడలు బద్దలు కొడతా అని అన్నావు
సొంత జిల్లాలో అన్నను గెలిపించలేని పవన్ మమల్ని గెలిపించాడా అని హేళన చేసిన TDP MLA చింతమనేని చౌదరి, పవన్ ఎవరో తెలీదు ఆని టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు చెప్పిన పార్టీ అయిన టీడీపీ ని కనీసం మీ సొంత జిల్లాలో అయిన ఓడించు !!!

ఇక వారసత్వ రాజకీయాలు అని కుళ్ళు జోకులేంటి?
మీ అన్న చిరంజీవి కష్టపడి పైకొచ్చాడు, ఒప్పుకుంటాము
మరి నీవెక్కడినుంచి వచ్చావు సినిమాల్లోకి ? ఇప్పుడు మెగా క్యాంపు నుంచి అరడజను మంది హీరోలు ఎలా వచ్చారో? మరి దీన్నేమంటారో?

సినిమాల్లో మెగాస్టార్ తమ్ముడు రాజకీయాల్లో మాత్రం కానిస్టేబుల్ కొడుకు ఎలా అవుతాడో?

నీవు ఇంటర్ తో చదువు మానేశా అని చెప్పావు తప్పు లేదు కానీ ప్రపంచాన్ని చదువు నీ చుట్టూ ఏమి జరుగుతుందో చదువు !!!
లేదంటే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని నీలాగా మాట్లాడుతారు !!!

బానిస బ్రతుకుల కావాలా ఆంటూ ఎవరికో బానిస కాకు !!!

సినిమాల్లో నటిస్తే చూస్తారు , నిజ జీవితంలో నటిస్తే ఊస్తారు !!!

లేదూ ‘ఎదుటివానికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్’ అనే అక్కినేని పాట పాడుకుంటావా నీ ఇష్టం అజ్ఞానవాసి !!! )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *