ఫార్టీ ఇయర్స్ పొలిటీషియన్ పరువు పాయే “తూచ్ అనేసిన పవన్” పొత్తు ఎత్తు చిత్తు బాబు ఇమేజ్ డ్యామేజ్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ మోస్ట్ నాయకుడు ఏపీలో ఆయన సరిసాటి నేత కూడా ఎవరూ లేరు, అటువంటి బాబు ఈ మధ్యకాలంలో పొతున్న పోకడలు పార్టీలు తో పాటు ఆయన పరువును కూడా దారుణంగా తీసేస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ తో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి బాబు మనిషిలో మనిషి లేదన్నది నిజం. ఆయనలో నిలువెల్లా అభద్రతాభావం పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు ఓటమికి దారితీస్తుందన్న కారణంతో బాబు చేయకూడని పనులెన్నొ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా పార్టీ మూల సిద్ధాంతాలకే తిలోదకాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీతో నిస్సిగ్గుగా చేతులు కలిపేశారు దాని ఫలితాన్ని తెలంగాణ ఎన్నికల్లో చవి చూశారు గోరంగా రెండు పార్టీలు ఓడిస్తూ సరైన గుణపాఠం చెప్పారు అని అనుకున్నారంతా.

ఇక ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారంలో అలా పెండింగ్లో ఉండగానే ఇప్పుడు ఏకంగా జనసేనని పవన్ కళ్యాణ్ తో పొత్తు పాటు అందుకున్నారు. రెండు రోజుల క్రితంవ్యూహాత్మకంగానే బాబు పవన్ మాతో కలిస్తే తప్పేంటి అంటూ కెలికారు. పవన్ పోటీ చేయడంతో వైసీపీ అధినేత జగన్ ఇరకాటంలో పడ్డారంటూ సెటైర్లు కూడా వేశారు . పవన్ టీడీపీతో కలుస్తారా అన్న మీడీయా ప్రశ్నలకు కూడా ముసిముసి నవ్వులు చిందిస్తూ వ్యూహాత్మకమైన ప్రశ్నలకు సమాధానాలు ఉండవని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.

ఇదే అవకాశంగా వైసీపీ సైతం రెచ్చిపోయి డఆ ఇద్దరూ ఒక్కటేనంటూ మరింత ఆజ్యం పోసింది. ఇక్కడితో ఇది ఆగిపోలేదు జన్మభూమి కార్యక్రమాలలో పాలుపంచుకునేందుకు కుప్పం వెళ్లిన చంద్రబాబు అక్కడ ఈసారి ఏకంగా బహిరంగసభలోనే పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారు. కేంద్రంపై పోరాటంలో తమతో కలిసి రావాలంటూ బాబు ఇచ్చిన పిలుపుతో ఉలిక్కిపడింది జనసేన. ఇది మామూలు రాజకీయ జిమ్మిక్కు కాదని, కావాలనే చంద్రబాబు ఇరికిస్తున్నారని గ్రహించిన జనసేనాని గురువారం ట్విట్టర్ ద్వారా తన స్పష్టంగా పార్టీ విధానాన్ని ప్రకటించారు. జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, వామపక్షాలతో కలిసి మొత్తం 175 స్థానాల్లో పోటీకి దిగుతామని , అందులో యువతకు, మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకొచ్చారు. పవన్ ప్రకటనలో టీడీపీ వ్యూహకర్తల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరిగా మారింది.

అబ్బే పవన్ తో పొత్తును టీడీపీ ఎప్పుడు కోరుకోలేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న మీడియా ముందు వచ్చి వివరణ ఇవ్వడం పసుపు శిబిరం సంకట పరిస్థితికి అద్దం పడుతోంది. నిజానికి గత రెండు రోజులుగా టీడీపీలో ఓ స్థాయిలో జనసేన, టీడీపీ కి పోత్తును ప్రచారం చేసిన సంగతి లోకమంతా చూసింది, ఏకంగా సీనియర్ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు సైతం రెండు పార్టీల పొత్తు ఆహ్వానించడం కూడా తెలుగు జనం కళ్లారా చూశారు ఇంత చేసిన తర్వాత పవన్ నో అనే సరికి టీడీపీకి మారు మాట లేకుండా పోయింది. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరువు పోయినట్లయింది. ఇక టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరింతగా రెచ్చగొట్టారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన జనసేన తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఘాటైన మాట అనేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పోత్తు కాదని హీరో గా మిగిలితే, పొత్తు కోసం పడిగాపులు

పొత్తు కోసం పడిగాపులు పడిన పార్టీగా టీడీపీ జనం దృష్టిలో మరింతగా పలుచన అయిపోయింది ఎందుకలా ముంగిట్లో ఉన్నవేళ పొత్తులు లేకపోతే గెలవలేమన్న బేలతనాన్ని చాటుకుంటూ ముందే ఓటమిని చాటుకుందని కూడా సెటైర్లు పడుతున్నాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *