నేడు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా…

ముందుగా పరిటాల రవి గూర్చి ఈ తరానికి తెల్సింది ఎంత అంటే ఆ పర్వర్టెడ్ రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర రెండు భాగాలంత ..ఇంకాస్త ముందుకు వెళ్తే మోహన్ బాబు తీసిన శ్రీరాములయ్యా అంత.
ఇప్పుడు ఇది రాయడానికి కారణం ఏమిటి అంటే పరిటాల ని గత 15 ఏళ్లుగా కులం ధృష్టిలో చూస్తూ మోస్తున్న ఒక కులం యువకులని అలాగే అతను ఆ కులం వాడు కాబట్టి అతడిని అతడి పోరాటాలపై అవగాహన లేక గుడ్డిగా ద్వేషిస్తోన్న మిగతా వర్గాల కోసం. .ముఖ్యంగా అతడిని కమ్మ కులస్తుడైన ఏకైక కారంతో అభిమాణిస్తోన్న ద్వేషిస్తోన్న వర్గాల కోసం..

నిజానికి పరిటాల కుటుంభంలో అతని తండ్రి పరిటాల రాములు మరియు అతని సోదరుడు పరిటాల హరి ఇద్దరు పోరాడింది అక్కడ ఫ్యూడల్ శక్తుల మీద. అక్కడ ఫ్యూడల్ శక్తులు పేదలపై చేస్తోన్న ఆధిపత్యాన్ని ప్రశ్నించి , తమకి ఉన్న పొలాలని పెదాలకి బడుగు బలహీన వర్గాలకు దానం చేసి అదే పోరాటంలో చనిపోయాడు. తండ్రి మరణంతో పరిటాల హరి కూడా అదే ఫ్యూడల్ శక్తులతో పోరాటంలో భాగంగా మరణించాడు .

ఇక్కడ పరిటాల రాములయ్యా గాని పరిటాల హరి గాని పొరాడింది కమ్మ కులస్తులు కోసం కాదు అక్కడ ఉండే బోయ కురుమ ఈడీగా కులాల కోసం BC లకోసం దళితుల కోసం..

అలా వారిద్దరిని కోల్పోయిన పరిటాల రవి కూడా అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న ఫ్యూడల్ శక్తులని ఎదుర్కోవడానికి అప్పటికే తన కులం వాడు స్ధాపించిన పార్టీ ఉన్నా అందులో చేరలేదు. వామపక్ష ఎర్ర శక్తులతో జేరి అజ్ఞాతంలో ఉంటూ పోరాడాడు. తరువాత నక్సల్స్ పై నిషేధం ఎత్తివేతలో భాగంగా జనజీవన స్రవంతిలో కలిసి ఆ ఫ్యూడల్ భూస్వామ్య శక్తులని ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీ అండ అవసరమై తెదేపా పార్టీలో జెరాడు.

అసలు పరిటాల ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్, భాష, తగరకుంట ప్రభాకర్ మధు సుధన్ రెడ్డి వంటి వారు విభిన్న కులాలకు చెందిన వారు. ఇక రాజకీయంగా పరిటాల ప్రోత్సహించిన నిమ్మల కృష్ణప్ప BK పార్థసారథి,కేతిరెడ్డి,కాలువ శ్రీనివాసులు, CC రంగనాయకులు వంటి ఇతర కులాలవారినే ప్రోత్సాహించారు అదే సమయంలో కమ్మ రాజకీయ నాయకులైన పయ్యావుల, ప్రభాకర చౌదరి, గోనుగుంట్ల వంటి వారిని ఓడించారు.. ఉన్నవ హనుమతురావు గారికైతే టికెట్ కూడా దక్కనివ్వలేదు.

స్వకులస్తులైన వరదాపురం సూరి వెలకుంట రాజన్న వంటి వారిని చివరి రోజుల్లో మనస్పర్ధలతో దూరం పెట్టారు. ఇంకా పరిటాల చేసిన కుల రాజకీయం ఏమిటి..అతను రాజకీయ ఆధిపత్యం చూపాడు తప్ప కులాధిపత్యం చూపలేదు అలాంటి పరిటాలని కమ్మ నాయకుడిగా చూపుకున్నామా జరిగిన లోపం ఎక్కడ ఉందో చూద్దామా.??

ఒక దశ వరకు పరిటాల కమ్మ కులస్తుడు అని చాలా మందికి అంతెందుకు కమ్మవారిలోనే చాలా మందికి తెలియదు. అలాంటి పరిటాల రవి రాజకీయంగా శక్తిగా మారాక కొన్ని అనూహ్య సంఘటనల వల్ల, గతం తాలూకు పోరాటాల వల్ల పగల వల్ల బాంబు పేలుళ్ల వంటి సంఘటనలు వల్ల పరిటాల రవి అంటే రాష్ట్రం అంతటా తెలిసింది.. మోహన్ బాబు శ్రీరాములయ్యా సినిమా తీయడం అదనపు బరువు పరిటాల నీడ ఏర్పడింది..పరిటాల కులం అందరికి తెలిసింది 97 తరువాతే… పరిటాల ని కులం ధృష్టిలో చూడడం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడడం మొదలయ్యింది. అగ్రహీరో తో జరిగిన వాస్తవావాస్తవాల ప్రచారం నుండి పరిటాల ని ఒక కులం పార్టీ నాయకుడిగా చూడడం మొదలయ్యింది.
ఆ సంఘటనలో వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే అప్పట్లో ఏ తెలుగు పత్రికలలో రాని విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక ఆ సంఘటనని మసాలా జోడించి రెండు కులాల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లాభం కోసం పదే పదే ప్రచురించి అప్పటికే సినీరంగ రాజకీయ రంగాలలో విబేధాలు ఉన్న రెండు కులాలని మరింత విడదీసి ఒక కులానికి రాజకీయంగా లాభం కలిగెలా వార్తలు ప్రచురించింది.

ఈ సంఘటన తరువాత ఆ రెండు కులాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆయా కులాల యువత కూడా దీనిని తమ ఆధిపత్యం ప్రదర్శించదానికి పనికిమాలిన సినిమా పిల్ల బిత్తిరీ ఫాన్స్ వార్ కోసం కుల కోణంలో ఆలోచించాయి తప్ప ఇందులో ఆ ఆంగ్ల పత్రిక చేసిన రాజకీయ కోణం గమనించలేదు. అప్పటి నుండి పరిటాల ని కమ్మ యువత ఒన్ చేసుకుంది మిగతా కులాలు పరిటాల ని కులం ధృష్టితో చూడడం ప్రారంభించాయి. ఇదే క్రమంలో పరిటాల ఎదుర్కొన్న పోరాడిన ఫ్యూడల్ శక్తులని అని మరిచి పరిటాల పిల్ల పిత్రే కమ్మా కాపు చిరంజిబి బాలయ్య వంటి ఫాన్స్ వార్ కోసం వాడుకోబడ్డాడు. తాను తన కుటుంభం పోరాడింది బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనే విషయం వెనక్కి పోయి మిగతా చిల్లర విషయాలు ముందుకునెట్టబడ్డాయ్…

ఆ ఆంగ్ల పత్రిక చేసిన రాజకీయ కోణాన్ని గుర్తించలేకపోయారు.. మిగతా వారి గూర్చి అనవసరం ఇకనైనా యువత పరిటాల కుటుంబాన్ని ప్రతిదశలో పేదల కోసం బడుగు బలహీన వర్గాలు కోసం నిలిచిన కుటుంబాన్ని ముఖ్యంగా పరిటాల రవిని దయచేసి ఒక కులానికి పరిణితం చేయకండి…

ఫ్యూడల్ శక్తులపై వర్గాలకు పోరాట యోధుడిపైన కుల వర్గ ముద్ర వేసి , ఇంకొందరు తెలిసి తెలియక సామ్యవాధి అయిన పరిటాలని తమ కులం వాడే అని ముద్ర వేసి ఎక్కువగా ఒన్ చేసుకొని ఉండవచ్చు. కానీ..అర్దం చేసుకుంటే అతని జీవితాన్ని అతని తండ్రి కాలం నుండి నిశితంగా హ్రదయంతో అర్ధం చేసుకుంటే అంతు లేని పరిటాల పోరాట స్ఫూర్తి అర్దం అవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *