ఏప్రిల్ 11న బాబుకు వాతలుపెట్టేందుకు కర్రు కాల్చుతున్నారని వ్యాఖ్యలు:గుప్పించిన విజయసాయి.

కర్రు కాల్చడం మొదలెట్టారు.. ఏప్రిల్ 11న బాబుకు వాతలు పెడతారు’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలపై వరుస ట్వీట్లతో ఒంటికాలిపై లేచే వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన విజయసాయి.
ఏప్రిల్ 11న బాబుకు వాతలుపెట్టేందుకు కర్రు కాల్చుతున్నారని వ్యాఖ్యలు.
ఐదేళ్లు పాలించిన చంద్రబాబు తానేం చేశాడో చెప్పలేకపోతున్నాడని ఆరోపణ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒంటికాలిపై లేచే వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఏప్రిల్ 11న వాతలు పెట్టేందుకు కర్రును కొలిమిలో వేడిచేయడం మొదలుపెట్టారంటూ ట్వీట్ చేశారు.

‘ప్రజల జ్ఞాపక శక్తి, మేధస్సుపై చంద్రబాబుకు చిన్నచూపు ఉంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతికి గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకోవాలనేది కూడా తమను చూసే ప్రజలు అలవాటు చేసుకున్నారన్నప్పుడే కర్రును కొలిమిలో వేడి చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 11న వాతలు పెడతారు’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అలాగే రాప్తాడులో వైసీపీ అభ్యర్థి ప్రచారాన్ని పోలీసులే అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కి పోలీసులే తెలుగుదేశం ప్రచారకర్తలుగా మారారు. ఎన్నికల కమిషన్‌ రాప్తాడుపై ప్రత్యేక నిఘా పెట్టాలి’ అని కోరారు.

‘ఐదేళ్లు పాలించిన వ్యక్తి తానేం చేశాడో, ఏం చేయాలనుకుంటున్నదీ వినమ్రంగా ప్రజలకు నివేదిస్తాడు. చంద్రబాబేమో ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతోంది. పొరుగు రాష్ట్రం దాదాగిరి చేయాలని చూస్తోంది అంటూ దివాలాకోరు మాటలు చెబుతున్నాడు. పదవి పోతుందన్న తన భయాన్ని ప్రజలకు ఆపాదించాలని చూస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు.

‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి అర్థరాత్రి పారిపోయి వచ్చిందెవరు?ప్యాకేజీ తీసుకుని రాష్ట్ర ప్రజల హక్కును తాకట్టు పెట్టిందెవరు? కుట్రలు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలతో క్రైంను వ్యవస్థీకృతం చేసిన వ్యక్తి ఈ రోజు సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు’అని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *