న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో..అమరావతి రైతులు మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వినూత్న నిరసన ప్రదర్శించారు.

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలబడ్డారు.
మూడు రాజధానులపై అమరావతి రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలిపిన రోజు నుంచి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు.
న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలబడ్డారు. మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వేడుకున్నారు.
వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.
తమ ఆశ మొత్తం హైకోర్టుపైనే ఉందని రైతులు అంటున్నారు. అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని.. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం రోడ్డుపై నిలుచోబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలే దేవస్థానాలుగా భావించి న్యాయమూర్తులను వేడుకుంటున్నామన్నారు. అంతేకాదు సోమవారం రోజు శిబిరాల్లో హైకోర్టుకు తుళ్ళూరు మహిళ రైతులు ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టుకు నమస్కారం చేశారు.