108 ప్రారంభోత్సవం,ఎంపీ మీ జన్మదినం ఒకే రోజు ఒకే రోజు రావడం యాదృచ్చికమా?లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా..టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర ట్వీట్

ఎంపీ విజయసాయి పుట్టిన రోజే జగన్ చేతులమీదుగా.. టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర ట్వీట్
ప్రజలకు వైద్యం అందిచడంతో పాటూ ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు జగన్ సర్కార్ కీలకమైన ముందడుగు వేసింది.
అధునాతన సౌకర్యాలతో 108, 104 వాహనాలను లాంఛ్ చేయబోతుంది.. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా విజయవాడలో ప్రారంభకానున్నాయి.
అయితే ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నాడే వాహనాలు ప్రారంభింస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘రూ.300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా?
ఇప్పటికైనా ఆలస్యం కాదు మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ విజయసాయిరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు’అంటూ కాస్త వెరైటీగా విషెస్ చెప్పారు.
ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే 412 అంబులెన్సులను కొనుగోలు చేసింది. ఈ 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)తో తీర్చి దిద్దారు.
మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్ కేర్ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దింది. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు.