ఎన్టీఆర్ కథానాయకుడు

NTR Kathanayakudu Grand USA Premieres on Jan 8th

NTR Kathanayakudu Grand USA Premieres on Jan 8th

ఎన్టీఆర్ అంటే నందమూరి తారకరామారావు వే కాదు నట సింహుడు, ధ్రువ తారకుడు, రాజకీయ దురంధరుడు యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణ రాముడు, తెలుగు అనే మూడు అక్షరాలు వింటే రక్తం ఎలా ఉప్పొంగుతుంది, ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే మనసు పులకిస్తుంది,

సాంఘిక జానపద పౌరాణిక లో అనేక వైవిధ్యమైన పాత్రలో ఎన్టీఆర్ పోషించారు, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు, కృష్ణుడిగా రాముడిగా రావణాసురుడిగా దుర్యోధనుడిగా తన నటన చాతుర్యంతో ఆయా పాత్రల్లో లీనమై నటించి ప్రేక్షకుల నోట శభాష్ అనిపించుకున్నారు, కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు, విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనలను పొందినారు, ఎన్టీఆర్ కి పట్టుదల క్రమశిక్షణ కలిగి అనుకున్నది సాధించుకునే వారు, ప్రపంచ దేశాలలో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సహాయ సహకారాలు అందించే వారు, తనను ఆదరించి అభిమానించిన ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు, 1983 జనవరి 9 న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు, ప్రపంచ దేశాలలో తెలుగువాడి పౌరుషాన్ని తెలుగువాడి సత్తాను చాటి చెప్పారు, తెలుగుదనం గొప్పదనం అంటూ చాటారు, రాజకీయాలలో సరికొత్త రికార్డును సృష్టించారు, బడుగు బలహీన వర్గాలకు కిలో రెండు రూపాయల బియ్యం ఇచ్చి వారికి అండగా నిలబడ్డారు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారు, అనేక మంది కొత్త యువ నాయకులను తయారు చేశారు, అలాంటి ఎన్టీఆర్ జీవిత గాధను తనయుడు బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఈ రోజు విడుదల చేస్తున్నారు తప్పక ప్రేక్షకుల మనలను పొందుతుందని ఆశిద్దాం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *