నిమ్స్ ఆసుపత్రిలో ఘోరం… ఆపరేషన్ చేసి కత్తెర కడుపులో వదిలేసారు…

హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మహిళా రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు.

ముఖ్యాంశాలు:
ఓ మహిళకు హెర్నియా ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేశారు .రెండు నెలల తర్వాత ఈ విషయం బయట పడడంతో రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు నెలలైనా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆ మహిళకు కుటుంబ సభ్యులు. ఎక్స్ రే తీయించగ కడుపు లోపల కత్తెర ఉన్న విషయం బయటపడింది. దీంతో రోగి బంధువులు నిమ్స్ కి చేరుకుని ఆందోళన చేపట్టారు. రోగం నయం ఆవుతుందని ఆస్పత్రికి వస్తే ప్రాణాలు మీదకు తెస్తున్నారని మండిపడుతున్నారు.

నిమ్స్ డాక్టర్లు హడావుడిగా ఆపరేషన్ లు చేస్తూ రోగుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మంగళ హార్ట్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ హెర్నియా తో బాధపడుతూ 3 నెలల క్రితం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి వచ్చింది.

ఆమెను పరీక్షించిన డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో ఆమెకు గత ఏడాది డిసెంబర్ 2న ఆపరేషన్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మహిళ రోజు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడంతో శనివారం ఉదయం ఆమెను నిమ్స్ కు తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే తీయగా అసలు విషయం అందరికీ తెలిసిందే. ఎక్స్రే లో కత్తెర స్పష్టంగా కనిపించడం తో డాక్టర్లు, రోగి బంధువులు షాక్ కు గురయ్యారు.

డాక్టర్ల నిర్లక్ష్యం ని నిరసిస్తూ రోగి బంధువులు నిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త కరమైన వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో నిమ్స్ వైద్యులు రంగంలోకి దిగారు. ఆమెను వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి తరలించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలియ లేదు ఇంకా.

ఆపరేషన్ చేసే సమయంలో నిమ్స్ డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ప్రజలు భగ్గుమంటున్నారు.

“NIMS doctors leave scissors inside patient’s stomach”

Man Files Complaint Against Hyderabad’s NIMS Hospital For Leaving Forceps in Wife’s Abdomen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *