భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు…

ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అతిథులు, రాజకీయ నేతలు, ప్రముఖుల రాకతో రాష్ట్రపతి భవన్ వద్ద సందడి నెలకొంది.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతోంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోదీతో పాటు బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలకు చెందిన పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.
ఇందు కోసం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖుల రాకతో అక్కడ సందడి నెలకొంది.
మోదీ ప్రమాణ స్వీకారం..
- రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
- భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వర భగవాన్ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
- భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. సభికులంతా లేచి నిలబడి ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేదికపై ఆసీనులైన నేతలు, అతిథులకు మోదీ అభివాదం చేశారు.
- భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు.
- మోదీ క్యాబినెట్‌లో ఒకే ఒక మంత్రి పదవి లభిస్తున్నందున బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
- అయినప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతామని ప్రకటించారు.
- బిమ్‌స్టెక్ నేతలు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఈసారి ప్రత్యేక అతిథులుగా బిమ్‌స్టెక్ నేతలు హాజరవుతున్నారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు.
- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక సీఎం హెచ్‌డి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు.
- సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, సద్గురు జగ్గీ వాసుదేవ్, పలువురు స్వామీజీలు రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకున్నారు.
రాష్ట్రపతి భవన్

- తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ కిషన్ రెడ్డికి మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కింది.
- సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- మోదీ కేబినెట్‌లో చోటుదక్కిన ఎంపీలంతా ఒక్కొక్కరుగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
- మోదీ క్యాబినెట్‌లో కొలువు దీరనున్న ఎంపీలకు పీఎంవో, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి.
- మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఎంపీలందరికీ మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు.