నారా లోకేష్ సెంటిమెంట్.. నామినేషన్‌కు ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం…

రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉంది. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరిని దేశంంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతాను.
1.నామినేషన్‌కు ముందు తల్లిదండ్రుల దీవెనలు తీసుకున్న లోకేష్.
2.ఉండవల్లి నుంచి మంగళగిరి వరకు టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ.
3.మంగళగిరి రామాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేష్ వేశారు.
ఉండవల్లి నుంచి టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయల్దేరి మంగళగిరిలో నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
నారా లోకేష్ వెంట తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.

రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు లోకేష్. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తే మంగళగిరిని దేశంంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతానన్నారు.
రాబోయే రోజుల్లో మంగళగిరి ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తననున తప్పకుండా ఆశ్వీరదిస్తారని.. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరిలో నామినేషన్ వేసే ముందు నారా లోకేష్ ఉండవల్లిలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం నామినేషన్ వేసేందుకు వెళుతున్న లోకేష్‌కు దిష్టి తీసి.. భార్య బ్రాహ్మణి ఎదురొచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి.. మంగళగిరి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
నారా లోకేశ్ ఆస్తులెన్ని..? అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలివే..
నారా లోకేశ్ మంగళగిరిలో నామినేషన్ వేశారు.

ఆయన రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్‌ను సమర్పించారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ఆయన వెల్లడించారు.
1.నారా లోకేశ్ మంగళగిరిలో నామినేషన్ వేశారు.
2.ఆయన రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్‌ను సమర్పించారు.
3.తన భార్య, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ఆయన వెల్లడించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం మంగళగిరిలో నామినేషన్ వేశారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఆయన నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా రిట్నరింగ్ అధికారికి ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు.
తన దగ్గర రూ.253.68 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట‌్‌లో పేర్కొన్నారు.
తన భార్య బ్రాహ్మణి పేరిట రూ.14.49 కోట్ల విలువైన ఆస్తులు, తన కొడుకు దేవాన్ష్ పేరిట రూ.3.88 కోట్ల విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. తనకు మూడు కార్లు ఉన్నాయని చెప్పారు.
హెరిటేజ్‌లో తన పేరిట రూ.47.32 లక్షల విలువైన షేర్లు.. తన భార్య పేరిట రూ.10.34 కోట్ల విలువైన షేర్లు, తన కొడుకు పేరిట రూ. 1.35 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు.

తన పేరిట రూ.66.76 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట్‌లో తెలిపారు. తన భార్య పేరిట రూ.18.74 కోట్లు, తన కొడుకు పేరిట రూ.16.17 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు.
తనకు రూ.5.72 కోట్లకుపైగా రుణాలు ఉన్నాయన్న లోకేశ్.. తన భార్య పేరిట రూ.3.41 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయని తెలిపారు.
2017లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సమయంలో తన పేరిట రూ.273.84 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. కాగా ప్రస్తుతం లోకేశ్ స్థిర, చరాస్తుల విలువ రూ.319.68 కోట్లుగా ఉంది.