ప్రొడ్యూసర్ గా మారిన నాని……

న్యాచురల్ స్టార్ నాని గతంలో “డి ఫర్ దోపిడి” అనే సినిమాకి సమర్పకుడు గా వ్యవహరించాడు.

తరువాత మరికొంత కాలం గ్యాప్ తీసుకొని “ఆ” అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ఈ సినిమా నానికి మంచి హిట్ ని తెచ్చి పెట్టింది.

ఇక మళ్ళీ సినిమా నిర్మాణం వైపు వెళ్ళని నాని, ఇప్పుడు” జెర్సీ” అనే ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

గౌతమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి ప్రొడక్షన్ లో, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఓ సినిమా చేస్తారు.

ఈ రెండు సినిమాల తరువాత తనే హీరోగా ఉంటూ ప్రొడ్యూసర్ గా కూడా సినిమా చేయాలని భావిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *