సారీ చెప్పిన నాగబాబు…

‘నా ఇష్టం’పేరుతో యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులుగా చెలరేగిపోతున్న మెగా బ్రదర్ నాగబాబు.

జనసేన అధినేత రాజకీయ ప్రత్యర్థులను నాగబాబు తనదైన స్టైల్ లో ఉతికి ఆరేస్తున్నారు. ఆయన పోస్ట్ చేస్తున్న సెటైరికల్ వీడియోలు కొన్ని భలేగా దూసుకు వెళ్తున్నాయి.

ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద ఆయన తనయుడు నారా లోకేష్ లను పొగిడేస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఒక కథనంపై నాగబాబు చేసిన ఓ వీడియో సూపర్ గా హిట్ అయింది.

కానీ కొన్ని వివాదాస్పద విషయాల వల్ల యూట్యూబ్ నుండి తొలగించబడింది మరోవైపు తాజాగా ఏబీఎన్ ను టార్గెట్ చేస్తూ వీడియోను పోస్ట్,’సి బి ఎన్ భజన కృష్ణ.. భట్రాజ్ పొగడ్తలు…’అంటూ నాగబాబు పెండింగ్ పెట్టడం మరో వివాదానికి దారి తీసింది.

భట్రాజులు అనే పదాన్ని నెగెటివ్ మీనింగ్ లో వాడుతుండటంతో ఈ పేరుతో ఉన్న సంఘం ముందు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. నాగబాబు ను కూడా ఆ సంఘం తప్పుబట్టింది. దీంతో ఆయన తప్పు సరిదిద్దుకుని ప్రయత్నం చేశారు.

వారికి క్షమాపణ చెప్పు ఒక ప్రకటన విడుదల చేశారు”ఈ ఉదయం పోస్ట్ చేసిన వీడియోకి ఒక చిన్న వివరణ అంటు” భట్రాజు అని ఒక సంఘం ఉందని తనకు తెలియదని చెప్పారు.” భట్రాజు సోదరులకు కించపరచడం నా అభిప్రాయం కాదు.

పొరపాటున నా నోటి నుంచి ఆ పదం దొర్లి నందుకు నన్ను క్షమించండి… అని నాగబాబు పేర్కొన్నారు. తప్పు జరిగాక ఇలా హుందాగా క్షమాపణ చెప్పడం పట్ల నెటిజన్లు నాగబాబును ప్రశంసలతో ముంచెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *