వైఎస్ కుటుంబంపై హత్యా రాజకీయం ఆగడం లేదు!

వైఎస్ రాజారెడ్డి హత్య.. ప్రత్యర్థులను వదిలేసిన రాజశేఖర రెడ్డి. కంటికి కన్ను సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కు స్వస్తి పలికారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగి, తన తోటి ఉన్న వాళ్లను కూడా ఆ దిశగా సాగేలా చేశారు వైఎస్. ఆ తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రజల మన్నన పొందారు.
తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వైఎస్ మరణించారు. వైఎస్ మరణోదంతం అనుమానాస్పదంగా నిలిచింది. సంచలనం రేపింది. అయితే అది ప్రమాదంగానే నిర్ధారణ చేశారు.
ఇక కోడి కత్తితో జగన్ మీద జరిగిన దాడి.. మొదట తేలికగా కనిపించినా, అందులో కూడా చాలా అనుమానాలు రేగాయి. కత్తి చిన్నదే అయినా కుట్ర పెద్దదే అనే అభిప్రాయాలు వినిపించాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎవరో, వైఎస్ జగన్ అంటే ఎవరో.. స్థానికులకు బాగా తెలుసు. అయితే ఆ స్థానికులు ఎవరో వైఎస్ వివేకానందరెడ్డికి బాగా తెలుసు. వైఎస్ కుటుంబానికి ఉన్న పరిచయాలతో మమేకం అవుతూ.. స్థానికులను కలుపుకుని రాజకీయం చేస్తూ.. సాగారు వివేకానందరెడ్డి. అందుకోసమే.. జమ్మలమడుగు నియోజకవర్గం బాధ్యతలు కూడా వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగించారు జగన్ మోహన్ రెడ్డి.
జమ్మలమడుగు ప్రాంతం వైఎస్ కుటుంబానికి ఆట పట్టు అయిన ప్రాంతం. పులివెందుల తర్వాత వారికి ఉన్న పరిచయాలు అత్యధికం జమ్మలమడుగులోనే.
అక్కడ సుధీర్ రెడ్డి వంటి యువకుడిని అభ్యర్థిగా ప్రకటించిన జగన్.. గెలుపు బాధ్యతలను వివేకానందరెడ్డి మీద పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన హత్య జరిగిందని మాత్రం స్పష్టం అవుతోంది.
ఇప్పుడు అంతకు మించిన సంచలనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. వివేకానంద రెడ్డి ప్రస్తుతానికి ఎమ్మెల్యే కాదు, మరే పదవిలోనూ లేరు. అయితే.. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటారని మాత్రం కడప జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసు.
పులివెందుల, జిల్లాలో అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తరఫున స్థానికంగా రాజకీయం చేయడంలో సిద్ధ హస్తుడిగా నిలిచారు వివేకానందరెడ్డి.
వైఎస్ కుటుంబంపై హత్యా రాజకీయం కొనసాగుతోందని కూడా స్పష్టం అవుతోంది. తాము ఏమైనా చేయగలమని జగన్ ప్రత్యర్థులు ఈ హత్యతో స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు కూడా ఈ బరితెగింపు హత్యా రాజకీయం వెనుకడుగు వేయకపోవడం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయామైయింది
ముమ్మాటికీ హత్యే.. అసహజ మరణమే!
వైఎస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికి హత్యగానే భావిస్తున్నట్టుగా ప్రకటన చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
వివేకానందరెడ్డి అనుమానాస్పద మరణంగా, అసహజమైన మరణంగా భావిస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
వివేకానందరెడ్డి మరణం విషయంలో తమకు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
తమ పెదనాన్నది అసహజమై మరణం అని వ్యాఖ్యానించారు కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి.
ఆయన మొహంపై గాయాలున్నాయని, పగలంతా ప్రచారం చేసిన ఆయన రాత్రికి రాత్రి అనారోగ్యంతో మరణించారంటే నమ్మశక్యం కావడం లేదని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయనది హత్యేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తును కోరుతున్నామన్నారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. కడప ఎంపీ సీటును కొడతామని తెలుగుదేశం పార్టీ అంత ధీమా వ్యక్తం చేయడం వెనుక ఇంత కథ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
సిట్ విచారణ నమ్మకం లేదని.. సీబీఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ వివేకానందరెడ్డి మరణోదంతం మాత్రం సంచలనమే రేపుతోంది. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అయిన, ప్రస్తుతం వైఎస్ కుటుంబంతో తీవ్ర స్థాయి వైరాన్ని నడపుతున్న కొంతమంది నేతలు.. ఇంతకు తెగించి ఉంటారనే అభిప్రాయాలు కడప జిల్లా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేనా.?
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. చిన్నాన్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన వైఎస్ జగన్, హుటాహుటిన హైద్రాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న కూడా ప్రచారంలో పాల్గొన్న వైఎస్ వివేకా, ఈరోజు తెల్లవారు ఝామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.
ఇదిలావుంటే, వైఎస్ వివేకా మృతి పట్ల అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన పీఏ కృష్ణారెడ్డి.
ఉదయాన్నే ఇంటికి వెళ్ళి చూసేసరికి వైఎస్ వివేకా రక్తపు మడుగులో పడి వున్నారన్నది కృష్ణారెడ్డి చెబుతున్నమాట.
మరోపక్క వైఎస్ వివేకాని ఎవరో హత్య చేశారంటూ కడపజిల్లా వ్యాప్తంగా గుగుసలు గుప్పుమున్నాయి.. అదీ ఉదయాన్నే ఈ ప్రచారం ప్రారంభం కావడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఈ ప్రచారాన్ని తెరపైకి తేవడం అనుమానాలకు తావిస్తోందని వైసీపీ చెబుతోంది.
తొలుత గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారనే వార్త వెలుగు చూసినా, అది హత్య.. అన్న అనుమానాలు కొద్దిగంటల్లోనే బలపడ్డాయి.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
మరోపక్క, ప్రభుత్వం ‘సిట్’ కూడా ఏర్పాటు చేసి, ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చుతామంటోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమ రాజకీయ ప్రత్యర్థులపై అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికార పార్టీ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది.
మంత్రి ఆదినారాయణరెడ్డి హడావిడిగా మీడియా ముందుకొచ్చారు.. వైఎస్ వివేకా మరణం పట్ల సంతాపం వ్యక్తంచేశారు. అక్కడితో ఆగలేదాయన.
తనపై వైసీపీ అనవసరపు అనుమానాలు వ్యక్తం చేస్తోందనీ, కడప ఎంపీ సీటు విషయమై వివేకానందరెడ్డికీ, ఆయన సోదరుడి తనయుడు అవినాష్ రెడ్డి (మాజీ ఎంపీ)కీ మధ్య గొడవలు తలెత్తాయని వింత, చెత్త వాదనను తెరపైకి తెచ్చారు ఆదినారాయణరెడ్డి.
కడపజిల్లాలో ఎన్నికల వేడి పీక్స్‌లోకి చేరిన ప్రస్తుత తరుణంలో వైఎస్ వివేకా మరణం.. రాజకీయంగా పెద్ద రచ్చకు కారణమవుతోంది.
ఇంతకీ, వైఎస్ వివేకాది సహజమరణమా.?
లేదంటే ఎవరైనా ఆయన్ని హత్య చేశారా.?
ఈ డెత్ మిస్టరీ వీడేదెప్పుడు.?
గుమ్మడికాయల దొంగ.. అనకుండానే భుజాలు తడుముకుంటున్న ‘సోకాల్డ్’ నేతల అత్యుత్సాహం వెనుక అసలు కారణమేంటి.?
ఏమో, విచారణలో డెత్ మిస్టరీ వీడుతుందో లేదో వేచిచూడాలి.