దరువుకు మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డ్.. పాఠకులకు అంకితం

బెదిరింపులు, హెచ్చరికలకు బెదరని దరువు.. పుట్టగొడుగుల్లా వందల సైట్లు పుట్టుకొచ్చి కనుమరుగైనా నమ్మిన సిద్ధాంతంకోసం నిలబడింది

దరువు వెబ్ మీడియా.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం.. అనతి కాలంలోనే దరువు కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై
కోట్లాది మంది మెప్పు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని అందించింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మంచి కార్య్రక్రమాలు చేసినపుడు అభినందించడంలో తప్పులు చేసినప్పుడు ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలపై పరిష్కార మార్గాలను చూపించింది. దరువుప్రతిపక్షాలను మేల్కొలుపుతూ అధికార పక్ష బాధ్యతలను గుర్తు చేయడంలోనూ దరువు వెనుకాడలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలు చేసినపుడు నిరంతరం దరువు ప్రజల తరపున తనవాణిని వినిపించేది.

ప్రజా వ్యతిరేక తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపడంలోనూ దరువు కృషి ఎనలేనిదని ఎందరో నేతలు, మేధావుల ప్రశంసించారు. పుట్టగొడుగుల్లా వందలాది సైట్లు, యూట్యూబ్ చానెళ్లు పుట్టుకొచ్చి కనుమరుగైనా దరువు నమ్మిన సిద్ధాంతంకోసం నిలబడింది. ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు.. ఎన్నో బెదిరింపులు, కేసులు పెడతామంటూ హెచ్చరికలు చేసినా దరువు ఏమాత్రం నెరవలేదు.

అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా పలు సలహాలు సూచనలిస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వ బాధ్యతలు గుర్తుచేసింది దరువు. అదేసమయంలో విపక్షాలన్నీ ఏకమై చేసిన కుట్రలను తిప్పికొట్టేందుకు దరువు శ్రమించింది. ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రజల్లో తన నమ్మకాన్ని పెంచుకుంది. దరువు స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకూ తెలుగురాష్ట్రాల్లో ఎన్నో సర్వేలు చేపట్టింది. వీటిలో ఒక్కటి కూడా ఇప్పటివరకూ దరువు అంచనాలు తారుమారు కాలేదంటూ ఎంత కచ్చితత్వంతో పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రజాదరణ విషయంలో దరువుకు ఎవరూ సాటిలేరు. ఈ క్రమంలో ప్రతి రోజు దరువు సైట్ ను వీక్షించేవారు సంఖ్య -2,00,000.. యూట్యూబ్ లో చూసేవారు సంఖ్య -8,00,000. డైలీ హంట్ లో చూసేవారు సంఖ్య -25,00,000.. ఫేస్బుక్ లో చూసేవారి సంఖ్య -10,00,000..ప్రతిరోజు వీక్షించేవారి సంఖ్య మొత్తం-10-12లక్షల వరకుచేరుకుంది.. ఇప్పటివరకు దరువు సైట్ ను వీక్షించినవారు సంఖ్య 30కోట్ల పైమాటే.. దరువు ఫేస్బుక్ లైక్స్-2, 23,000.. దరువు ఫేస్బుక్ ఫాలోవర్స్- 50,00,00.. ఇప్పటివరకు దరువు యూట్యూబ్ వీక్షకులు -35 కోట్లకు పైమాటే ఇంతిలా దరువు ప్రేక్షకులకు చేరువైంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డును సైతం దరువు గెల్చుకుంది.. ఈ అవార్డును దరువు ప్రేక్షకులకు అంకితమిస్తూ మీ ఆదరాభిమానాలు మాపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. -ఇట్లు దరువు యాజమాన్యం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *