మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్…. అంకెలు దాచవచ్చు, రైతుల ఆందోళన దాగదు కదా!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢీల్లీ పోలిమేరలో నీటి ఫిరంగులు , టియర్ గ్యాస్, లాఠీచార్జీలు ప్రయోగించింది.

రైతుల ప్రాణాలు బలిగోన్నది. ఇప్పుడు ఎన్నికల తరుణంలో రైతుకు ఏడాదికి ఆరువేలు నగదు సాయం ప్రతిపాదించింది. నిత్యజీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.

ప్రపంచ మార్కెట్ లో అతి తక్కువ ధరలున్న సమయంలో మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా పెంచింది. పేదల నుంచి మధ్యతరగతి వరకు అందరి జేబులకు చిల్లులు పెట్టింది.

ఇప్పుడు మధ్యతరగతికి పన్ను రాయితీ, అసంఘటిత కొర్మికుల పెన్షన్ పెంపు లాఃటి పథకాలను ఎరగా వేసింది. ఘనంగా చెప్పుకున్న రైతు బీమావల్ల అన్నదాతలకు మేలు జరగలేదని పార్లమెంటరీ కమిటీ తేల్చింది.

రైతులు రూ.42వేల కోట్లు ప్రీమియం చెల్లంచగా కేవలం రూ 33 వేల కోట్లు మాత్రమే పరిహారంగా చెల్లించారు. మిగిలిందంతా ప్రయవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభంగా కట్టబెట్టారు.

జన్ ధన్ ఎకౌంట్లలో జనం జమ చేసింది రూ 85 వేల కోట్లు కాగా, వారికి ఓవర్ డ్రాప్టు రూపంలో ఇచ్చింది కేవలం రూ.340కోట్లు. స్టార్ట్ అప్స్ ఒక డొల్ల అని తేలిపోయింది. 82 శాతం మంది లబ్ధిదారులకు బెనిఫిట్ అందలేని గణంకాలు వ్యక్తిరిస్తున్నాయి. ఈ ప్రసంగమంతా అబద్ధాలు కర్పూగా సాగింది.

మోడీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ ప్రభుత్వ గణాంకశాఖ లెక్కలు ప్రకారమే పారిశ్రామికాభివృద్ధి దిగజారింది. తయారీరంగం స్తంభించింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత భారతదేశం అభివృద్ధి వెనుక పట్టు పట్టిందని ప్రపంచబ్యాంకు తేల్చింది. విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పుకున్నారు.

ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులన్నీ కలిపితే 14 ఏండ్లు కనిష్టానికి పడిపోతాయని సెంటర్ ఫెర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) స్పష్టం చేసింది.

అభివృద్ధి అంటే కొత్త ఉద్యోగాలు సృష్టించటం అన్నారు బడ్జెట్ ప్రసంగంలో కానీ జరిగిందేమిటి? నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఇప్పుడే నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని నేషనల్ శాంపంల్ సర్వేతేల్చింది.

కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో సర్వేలో కూడా ఇదే బట్టబయలైంది. అజీంప్రేమ్ జీ యూనివర్సిటీ బృందం అధ్యయనంలో అనేక కొత్త కోణాలు బయటపడ్డాయి.

మోడీ పాలనలోనే నిరుద్యోగం గరిష్ఠస్థాయికి పెరగటంతో పాటు పురుషులకన్నా మహిళల్లోనూ , అగ్రవర్ణాల యువతకన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలలోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని నిగ్గుదేలింది.

ప్రయివేటీకరణ ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిరుపయోగమైన ఫలితమిది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తొలి ఏడాదిలోనే 40 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం నివేదిక చెబుతోంది.

గతేడాది ఒక్క సంవత్సరంలోనే కోటి పదిలక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని సీఎంఐఈ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచిన నివేదికల ప్రకారమే దేశంలో 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడస్తున్నట్టు? అవినీతి నిర్మూలించామని చెప్పుకున్నారు. రాఫెల్ కుంభకోణం, విజరుమాల్యా , లలిత్ మోడీ , నీరవ్ మోడీ లాంటి మోసగాళ్ళు పారిపోయిన తీరుచూస్తే నవ్విపోదురు గాక… అన్నట్టున్నది.

బ్యాంకుల ను మోసగించిన కేసులు ఈ నాలుగేండ్లలో నాలుగు రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంకు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *