మోడీ గారి ఎన్నికల బడ్జెట్

Modi - 10% reservation bill
ఎన్నికల బడ్జెట్ను పీయూష్ గోయాల్ ప్రవేశపెట్టారు.
గత నాలుగున్నరేళ్ల లో ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడిస్తూనే, వరుసగా వరాల జల్లు కురిపించారు.
ఎన్డీఏ హయాంలో ఈ స్థాయిలో నజరానాలు ఎప్పుడు అందించలేదని చెప్పాలి.
అన్ని అస్త్రాలను ఎన్నికల కోసమే ఆపి, ఒక్కసారిగా ప్రయోగించారు అన్నట్లుగా సాగింది.
ఈ బడ్జెట్లో ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట.
వేతన జీవులకు పన్ను మినహాయింపులు భారీగా లభించాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమాన్ కింద 5 ఎకరాల లోపు రైతులకు ఎంత 6000 చెల్లిస్తారు.
దీన్ని రెండు వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులు దీని నుంచి లబ్ధి పొందుతారని అంచనా.
దీనికోసం మొత్తం 75 కోట్లను కేటాయించారు.ఆదాయపన్ను పరిమితిని 5 లక్షలకుపెంపు,6.5 లక్షల ఆదాయం ఉండి ప్రావిడెంట్ ఫండ్ ప్రతి సాధిత పొదుపు పథకాలో పెట్టుబడులు పెట్టినవారు ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేదు.
రెండు లక్షల వరకు గృహ రుణాలు, ఆరోగ్య భీమా, జాతీయ పింఛన్ పథకానికి చెల్లించేవారు మినహాయింపు.
దీంతో మూడు కోట్ల మంది ప్రజలకు 18 .500 కోట్ల లబ్ది పెరుగుతుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులకు మధ్య ఎటువంటి సంబంధాలు లేకుండా చెల్లిస్తామని మంత్రి చెప్పారు.
పన్ను వ్యవస్థను పూర్తిగా కంప్యూటకరిసామని చెప్పారు.