మోడీ మనసులోని మాట…! సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం..!

కారోనా విలయతాండవం చేస్తుంది… ప్రతి రోజు వేల కొలదిలో కేసులు నమోదవుతున్నాయి వైద్య సిబ్బంధి దగ్గర వనరులు ఖాళీ అవుతున్నాయి.
ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి కొత్తగా వైద్యం కోసం వచ్చినవారికి చికిత్స చేసేందుకు చోటు కూడా ఉండట్లేదు.
రాష్ట్రాలు భయంతో వానికిపోతున్నాయి, కొన్ని రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.
మరి కొన్ని రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ అమలు చేసేందుకు ఆలోచిస్తున్నాయి, కేంద్రం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు మీడియా వర్గాల్లో సమాచారం.
ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని, ఆపై జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
ముందస్తు బుకింగ్ చేసిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నెలాఖరు లోపు అందరూ తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలని ప్రకటనలో పేర్కొనడంతో మరోసారి లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు అనే అనుమానం అందరిలో వ్యక్తమయ్యింది.
నిపుణులు కూడా కేంద్రం మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించబోతుందనే భావనను వ్యక్తభరుస్తున్నారు.
జులై 1 నుందో మరో నెలన్నర పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వారు అంచనాలు వేస్తున్నారు.
మొన్న జరిగిన మోడీ సిఎం ల కాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశం పై చర్చలు జరిగాయని మరో నెలన్నర లాక్ డౌన్ విధించడంతో కరోనా సంక్రమనాన్ని పూర్తిగా ముగింపజేయవచ్చని అంతలోపు కరోనా వ్యాక్సిన్ కూడా మార్కెట్ లో లభ్యమవుతుందని వారు అనుకూనట్టు తెలుస్తుంది.