2019 జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్కు కొత్త హైకోర్టును కేంద్రం మంజూరు చేసింది

రాష్ట్రపతి శ్రీ రామనాధ్ కొవింద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరి కోర్టు వారికి పని చేస్తుంది.అమరావతిలో నిర్మిస్తున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో హైకోర్టు కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
ప్రతీ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214వ సెక్షన్ చెబుతుంది.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 31 ప్రకారం ఏపీకి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు కావాలి.అది ఏర్పడే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు పనిచేయాలని సెక్షన్30(ఎ) చెబుతోంది.
హైకోర్టు విభజనకు సంబంధించిన దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పులో జనవరి 1లోగా హైకోర్టు విభజనకు అభ్యంతరల్లేవని సంబంధిత అధికారి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు కూడా సృష్టం చేసింది.దీనిపై తగుచర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
కొత్త సంవత్సరం తొలిరోజు ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ సి. ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.