ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే లోపలికి అనుమతి…ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

అసెంబ్లీకి వాళ్లెవరూ రావడానికి వీల్లేదు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అసెంబ్లీ కార్యదర్శి మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఓ బులెటిన్‌ను విడుదల చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత సిబ్బందని వెంట తీసుకురావొద్దని అసెంబ్లీ కార్యదర్శి కోరారు.

అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

భౌతిక దూరం పాటించిందేకు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతి ఉంటుదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే తమ కార్లకు కచ్చితంగా పాస్‌ అతికించాలని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

గుర్తు తెలియని వారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే అసెంబ్లీలోకి విజిటర్లను అనుమతించరాదని నిర్ణయించారు.

అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు.

బ్యానర్లు, ప్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించబోమని, అసెంబ్లీ ఆవరణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు.

సభ్యులంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. సభ్యులు పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను కూడా వెంట తీసుకురావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *