బాలయ్యని విమర్శిస్తూ వీడియోలను అప్లోడ్ చేసిన నాగబాబు …. ఇపుడు వైయస్ జగన్ మీద గురి

నందమూరి బాలకృష్ణ మీద మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేసి క్రియేట్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన చేసిన హడావిడితో టీడీపీ, జనసేన నడుమ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
యూట్యూబ్ ఛానల్ లో విమర్శిస్తూ వీడియోలను అప్లోడ్ చేసిన నాగబాబు వైయస్ జగన్ మీద గురి పెట్టారు. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు అంటూనే జగన్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
ఇటీవల టీవీ నైన్ లో జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్ వేశారు.
ఆ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ “ఎందుకు మీరు చంద్రబాబునాయుడు గారిని ఈ మాటలు అడగరు? అడగాలంటే ఆయన చేసిన అవినీతి అలా ఉంది అక్కడ. దాని మీద ఎంక్వయిరీ ఏ స్టేజ్ లో జరగనుంది నాకైతే తెలియదు. బహుశా స్టేజెస్ కూడా దాటిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
జగన్ మాటల్లో మనం ఇక్కడ ఒకటి గుర్తించాలి “నా కన్నా వీడు గొప్ప వాడు, అంటే దాని అర్థం ఏమిటి? వాడు చాలా గొప్పవాడు నేను కూడా గొప్ప వాడిని. ఇతను నాకన్నా ఎక్కువ సాధించాడు అంటే అతను బాగా సాధించాడు నేను కూడా ఎంతో కొంత సాధించాను.
అలాగే కొన్నిసార్లు వాడు నాకంటే పెద్ద ఎదవ అంటారు. అంటే ఏంటి వాడు పెద్ద ఎదవ నేను నేను కూడా ఎదవనే.
వాడు నాకంటే దుర్మార్గుడు అంటే నేను దుర్మార్గుడ్ని అని.
వాడు నాకంటే పెద్ద దొంగ అంటే నేను దొంగని.అలా చెప్తాం మనం.
కానీ ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా అదే కనిపిస్తుంది.
ఒక స్టేజ్ ఉంది, నాకు ఒక లెవెల్ ఉంది, నాకు ఒక రేంజ్ ఉంది, నా మీద కొన్ని కేసులు ఉన్నాయి, నాకంటే ఎక్కువగా ఎందుకు వెళ్లిపోయారు.
అంటే జగన్ ఒక రకంగా చంద్రబాబు ని చూసి ఫీలవుతున్నారని తెలుస్తోంది దీనిపై మీరేమంటారు”. అని జగన్ పై వ్యంగ్యాస్త్రాలను చేశారు నాగబాబు.