విశాఖలో మహాశివరాత్రి పర్వదినాన మహా కుంభాభిషేకం టి.సుబ్బరామిరెడ్డి

పకృతి విపత్తుల నుంచి విశాఖ నగరాన్ని కాపాడుకునేందుకే ఏటా మహాశివరాత్రి పర్వదినాన కోటి శివలింగాలను ప్రతిష్ఠించి మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం తన గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు పాతికేళ్లుగా కోటిలింగాలను ప్రతిష్టించిన మహాకుంభాభిషేకని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

హుద్ హౌద్ వంటి తీవ్ర విపత్తుల సమయంలోనే నగరానికి ఎటువంటి నష్టం వాటిల్లే పోవడానికి అభిషేక పూజలు కారణమన్నారు.

ఆ రోజు ఉదయం ఏడు గంటలకు తీరానికి వెళ్లి పూజలు చేస్తామని, ఎనిమిదిన్నరకు అభిషేక పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు.

మధ్యాహ్నం 3.5౦ కు మహాయాగం సాయంత్రం 5 గంటల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఆరున్నరకు సీనియర్ నటి బి.సరోజాదేవిని విశ్వ నట సామ్రాజ్ఞ వీటితో సత్కరించనున్నట్లు టీఎస్సార్ వివరించారు.

స్వరూపానందేంద్ర స్వామి ముక్కామల శ్రీధర్ స్వామీజీ భక్తులను ఆశీర్వదిస్తారని సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు వారన్నారు గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నాటిక హర హర మహాదేవ వంద మంది కళాకారులు ప్రదర్శిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *