ఓడినా, గెలిచినా …2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్.

ఓడినా, గెలిచినా మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్
2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటిస్తానని..

ఓటమికి కార్యకర్తలు, నేతలు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఫలితాలపై విశ్లేషణ తర్వాత భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటానని తెలిపారు.


1.వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానన్న లోకేష్
2.భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటన
3.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తా

మంగళగిరి నియోజకవర్గంతోనే తన ప్రయాణం కొనసాగుతుందంటున్నారు మాజీ మంత్రి నారా లోకేష్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా నింపే ప్రయత్నం చేశారు.

రెండు రోజులుగా అమరావతిలో మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తల్ని కలుస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు.

2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటిస్తానని.. ఓటమికి కార్యకర్తలు, నేతలు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. ఫలితాలపై విశ్లేషణ తర్వాత భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటానని తెలిపారు.

ఓటమిపై తాను బాధపడటం లేదని.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే అంద‌రూ రాంగ్ సెలక్షన్‌ అన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక అదే మాట అంటున్నారని చెప్పుకొచ్చారు. తాను మాత్రం మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తానన్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం.. ప్రజల అభిమానం కంటే విజ‌య‌ం మరొకటి ఉండదన్నారు.

ఓడిపోయినా.. ప్రజల మ‌న‌సులు గెలుచుకున్న విజేత‌నని.. ఏ క‌ష్టం వ‌చ్చినా కుటుంబ‌ స‌భ్యుడిగా అండ‌గా ఉంటానని భరోసా నింపే ప్రయత్నం చేశారు.

తర ఇంటి త‌లుపులు తెరిచే ఉంటాయన్నారు. మంగళగిరి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందన్నారు లోకేష్. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళిక‌లు సిద్ధం చేశానని..

ఓడిపోయినా వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *