టీడీపీ ఎమ్మెల్యే పేరుతో సోషల్ మీడియాలో లేఖ వైరల్.. కుట్ర జరిగిందా!

టీడీపీ ఎమ్మెల్యే రాసినట్టు ఒక లేఖ విడుదల అయ్యింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ లేఖను తాను రాయలేదంటున్న ఎమ్మెల్యే. అసలు ఆ లేఖ ఎలా వచ్చిందో తెలియదంటున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే పేరుతో సోషల్ మీడియాలో లేఖ వైరల్ అవుతోంది. ఆయన ఎలాంటి లేఖ విడుదల కాకుండానే సోషల్ మీడియాలోకి రావడం కలకలంరేపింది.
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాసినట్టు ఒక లేఖ విడుదల అయ్యింది.
అందులో విశాఖ అభివృద్ధి అమరావతితోనే సాధ్యం అంటూ వాసుపల్లి గణేష్ కుమార్ రాసినట్టు ఉంది. మూడు రాజధానులకు వ్యతిరేకమని.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నది ఆ లేఖ సారాంశం. అలాగే జగన్ సర్కార్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉంది.
ఈ లేఖను తాను రాయలేదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అంటున్నారు. అసలు ఆ లేఖ ఎలా వచ్చిందో తెలియదంటున్నారు. దీంతో ఈ లేఖ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
గణేష్ లేఖ రాయకపోతే.. ఈ లేఖ సోషల్ మీడియాలో ఎలా ప్రత్యక్షమైందనే చర్చ జరుగుతోంది. దీని వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ లేఖ వ్యవహారంపై ఎమ్మెల్యే కూడా ఆరా తీస్తున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.