జగన్‌ను నమ్మితే నట్టేట ముంచేస్తాడు: చంద్రబాబు

ఓట్లల్లో తప్పులు సవరించేందుకు ఫారం-7 వాడటం చట్టరీత్యా నేరమని చంద్రబాబు తెలిపారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు.

1.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు.
2.ఓటర్ల ప్రమేయం లేకుండా ఓట్లు తొలగించేలా ఫారం-7 దరఖాస్తు చేయడం నేరమని అన్నారు.
3.ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు.

రాష్ట్రంలో లక్షలాది ఓట్లు తొలగించేలా ఈసీకి ఫారం-7 సమర్పించింది తామేనంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎలక్షన్ మిషన్- 2019లో భాగంగా పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పటివరకు 16 ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షించామని, మరో 9 స్థానాలపై రివ్యూ చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. ఓట్ల తొలగింపు కేసులో జగన్ ఏ1 నిందితుడని, అలాంటి వారిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఓట్లల్లో తప్పులు సవరించేందుకు ఫారం-7 వాడటం చట్టరీత్యా నేరమని చంద్రబాబు తెలిపారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు.

రాష్ట్రంలో అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని అన్నారు.

టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ప్రజలు జగన్‌ని నమ్మితే నట్టేట ముంచేస్తాడని, అభివృద్ధి కోసం ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *