ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న లాయర్

గత కొంతకాలంగా ఏపీలో ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. దీనికి నిరసన ప్రకటిస్తూ నంద్యాల కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయిన ప్రముఖ న్యాయవాది అనిల్ కుమార్- పరిస్థితి విషమం.

కర్నూలు జిల్లా నంద్యాల లో లాయర్ ఆత్మహత్యాయత్నం చేసే సమయంలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది.

తన పరిస్థితిని వెంటనే గమనించిన స్థానికులు, తోటి లాయర్లు అనిల్ కుమార్ ని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు.

అనిల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు పేర్కొన్నారు.అనిల్ తన నుదిటిపై ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే పెయింట్తో రాసుకున్నాడు.

తన తోటి లాయర్లు అనిల్ ప్రత్యేక హోదా కోసమే ఆత్మహత్యాయత్నం చేసాడని చెప్తున్నారు.

తను తీసిన సెల్ఫీ వీడియోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఈ సంఘటనను పరిశీలిస్తూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో నంద్యాల కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *