ఓటు నమోదు చేసుకునేందుకు రేపే చివరి రోజు..

ఓటు నమోదు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది.
మార్చి 15 తర్వాత కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరించబోమని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మార్చి 25 వ తేదీ తరువాత వెల్లడించే ఓటర్ల జాబితాలో మరో 20 లక్షల కొత్త ఓట్లు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరించారు.
దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల 90 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా.
ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరు పైన ఉందని అన్నారు.
ఓటరు నమోదు పరిశీలనపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్న ద్వివేది పోలింగ్ రోజు తమ ఓట్లు గల్లంతయ్యాయి అని నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
ఓటు నమోదు కోసం online సమస్యలు ఉంటే offline లో లో దరఖాస్తులు చేయవచ్చని తెలిపారు.
బూత్ స్థాయి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు దరఖాస్తు నేరుగా సమర్పించవచ్చు అని తెలిపారు.
ఓటరు నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని ప్రధాన అధికారి స్పష్టం చేశారు.
ఓటర్ల సంఖ్యలో 7 నుంచి 9 శాతం పెరుగుదల నమోదు కావచ్చు అని చెప్పారు