ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కు జగన్ తో కేటీఆర్ బృందం భేటీ

ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు బుధవారము లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకుర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ని, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. యూపీఏ ఎన్డీఏ కూటమిలో లేని జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో జగన్ కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కూటమిలో తెలుగుదేశం అదే చంద్రబాబు నాయుడు జట్టు కట్టారు, ఆంధ్రప్రదేశ్లో భాజపాకు ఎదురు గాలి వీస్తుండటంతో జగన్ ముందున్న మూడో ప్రతైయముగ ఫెడరల్ ఫ్రంట్ ఒకటే కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేసి నా ఏపీ సీఎం తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తో తెరాస నేతలు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న డంతో వైకాపా, తెరాస నేత ల నేటి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
