పుట్టింటోళ్లు తరిమేశారు…. కట్టుకున్నోడు వదిలేశాడు

సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోతున్నారు అన్న వార్తలు జిల్లా రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన కొణతాల కొంతకాలం వైసీపీలో కొనసాగారు. ఆ పార్టీని వీడి చాన్నాళ్లుగా రాజకీయ వనవాసం చేస్తూ వచ్చిన ఆయన చివరకి తన దారి సైకిల్ దారి అని చెప్పుకునే చెబుతున్నారంటున్నారు. నిజానికి ఆయనకు ఇంతకు మించి వేరే గత్యంతరం లేదని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలు అనుబంధం కలిగిన నాయకుడు కొణతాల రామకృష్ణ. మంత్రిగా అయిదేళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన కొణతాల గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. వైఎస్సార్ రెండో మరో అధికారంలోకి వచ్చిన సమయంలో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొణతాల మరోమారు మంత్రి కాలేకపోయారు.

ఇక, ఆ తర్వాత వైఎస్సార్ బతికి ఉంటే ఏం జరిగేదో కానీ, ఆయన మరణానంతరం వైసీపీ లో చేరి అక్కడ కొంతకాలం చురుకుగా వ్యవహరించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ విజయమ్మ ఓటమి వెనక కొణతాల నిర్లక్ష్యం, ఉదాశీనత ఉందన్న కారణంగా వైసీపీ అధినేత జగన్ ఆయన్ని పక్కన పెట్టారు. మొత్తం జిల్లా బాధ్యతలను నెత్తిన పెడితే పార్టీ నిధులను సకాలంలో ఖర్చు చేయకుండా, అభ్యర్థులకు చేర వేయకుండా కొణతాల వ్యవహరించారన్న ఆగ్రహంతో కూడా జగన్ ఆయన్ని పూర్తిగా దూరం పెట్టారని అంటారు. ఇక కొణతాల కు వైసీపీలో ఎక్కువ గౌరవం ఇస్తే కూడా ఆయన సక్రమంగా వినియోగించుకోలేదని, పొలిటికల్ అడ్వయిజర్స్ కమిటీ లో తీసుకున్నా కూడా ఆయన పార్టీ గెలుపునకు తగిన బాధ్యత వహించ లేదన్న ఆగ్రహం జగన్ లో ఇప్పటికీ ఉందంటారు. ఇక స్వయంగా తన తల్లి ఓటమికి కొణతాల టీడీపీ బీజేపీ నేతలతో కుమ్మక్కు కావడం ఓ కారణమని జగన్ అనుమానించారు అని కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన కొద్ది నెలలకే కొణతాల ఆ పార్టీ నుంచి బయటకురావాల్సి వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే నాటి నుంచి కూడా కొణతాల రాజకీయంగా అంత చురుకుగా లేరు.

మరోవైపు ఆయన తిరిగి వైసిపిలోకి తీసుకుందామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో పాటు, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్ తల్లి విజయమ్మ వంటి వారు ఎంతగా చెప్పినా కూడా కొణతాల విషయంలో జగన్ మనసు మార్చుకోవడం తో ఆ పార్టీలో కొణతాలకు డోర్స్ క్లోజ్ అయిపోయాయి. మరోవైపు జనసేన నుంచి కూడా కొణతాల కు పిలుపు రాకపోవడంతో టిడిపి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అంటున్నారు. ఇక టీడీపీలో కొణతాల చాలాకాలం క్రితమే చారల్సిఉందని, అయితే జిల్లాకు చెందిన నాయకులు అడ్డుపడడం వల్లనే అది ఆగిపోయిందని చెబుతారు. అప్పట్లో కొణతాలను చేర్చుకునే విషయంలో చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను కోరగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన్ని పార్టీలోకి తీసుకోవద్దంటూ సూచించారని తెలుస్తోంది. ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అయితే, ఆయన వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం కూడా ఉందని అభిప్రాయంగా చెప్పినట్లుగా పేర్కొంటారు. అదే విధంగా మిగిలిన ఎమ్మెల్యేలు, నాయకులు కొణతాల రాకను వ్యతిరేకించటంతో బాబు ఆనాడు ప్రతిపాదనను పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇక, కొణతాల టీడీపీలో చేరికకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ద్వారా ప్రయత్నించిన చివరికి అది ఫలించలేదు. ఇప్పుడు మరో ప్రయత్నం గా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు ద్వారా లోకేష్ తో చెప్పించి చంద్రబాబు ను ఒప్పించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

దీనికోసం తన వంతుగా జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు కొణతాలను చేర్చేందుకు బాగానే ప్రయత్నం చేశారు. మరి, చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా, కొణతాల రామకృష్ణ వ్యవహారశైలి కూడా భిన్నంగా ఉంటుంది, ఆయనకు భేషజాల ఉన్నాయి. ఆయనకు అలకలు ఎక్కువన్న ప్రచారమూ ఉంది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు సాఫీగా రాజకీయ జీవితం కొనసాగించిన ఆయన నాయకులే హైకమాండ్ గా ఉండే వైసీపీలో ఇమడలేక పోయారు. ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీ టీడీపీ లో ఎంతవరకూ ఇమడగలరన్న చర్చ కూడా సాగుతోంది. కాగా, టీడీపీలో చేరికకు కొణతాల అనకాపల్లి ఎంపీ టిక్కెట్ట్ కండిషన్గా పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, అనుచరులు మాత్రం ఆయన అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలంటున్నారు. మరోవైపు మరోవైపు ఇదే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ మీద జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కన్ను ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక కొణతాల అనుచరుల్లో కొంతమంది టీడీపీలో చేరిక కు ఇప్పటికీ అంగీకరించడం లేదని కూడా ప్రచారం సాగుతోంది. సైతం తాను ఏ పార్టీలో చేరేది పండుగ తర్వాత చెబుతాను అంటూనే తన రాజకీయ ప్రయత్నాలు తాను చేసుకుంటూండడం గమనార్హం. మొత్తం మీద చూసుకుంటే ఈ సీనియర్ రాజకీయ నాయకుని ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం తెలుగుదేశం మరి ఆ పార్టీ లో ఆయన ఎప్పుడు చేరుతారు ఏ విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగుతుందన్నది రాజకీయ వెండితెర మీదకు చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *