యాత్ర చిత్రం పై కొడాలినాని హాట్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2003లో చేసినపాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందించబడింది. మహి. వి. రాఘవన్ వైయస్సార్ జర్నీ యాత్ర చిత్రం లొఎమోషనల్ గా చూపించారు.

ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. దర్శకుడు మహి వి రాఘవ్ చిత్రం ద్వారా వైఎస్ అభిమానులను కంటతడి పెట్టించేలా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైయస్సార్ పాత్రలో మలయాళ దిగ్గజం ముమ్మట్టి నటించారు.

యాత్ర చిత్రం పై రాజకీయ ప్రముఖుల ప్రశంసలు కురిపిస్తున్నారు. యాత్ర చిత్రం విడుదల కావడంతో గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ లీడర్ కొడాలి నాని అభిమానుల సంబరాల్లో పాల్గొన్నారు.

చిత్రం విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సినిమా రూపొందించటం సంతోషకరమైన విషయం అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 2003లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అందరికీ తెలుసు.

తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాటు ప్రజలను పట్టి పీడించింది, అలాంటి సందర్భంలో రాజశేఖర్రెడ్డి 1600 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు తొలగించే అద్భుతమైన పథకాలు చేపట్టారని, కొడాలి నాని ప్రశంసించారు. నాతో చిత్రంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాల వెనుక దాగి ఉన్న ఆలోచనని చూపించారని కొడాలి నాని తెలిపారు.

పేదవాడు కిసరైన వైద్యం అందక లక్షల్లో డబ్బు ఖర్చు చేయలేక ప్రాణాలు కోల్పోతుంటే, రాజశేఖర్రెడ్డి మహానుభావుడ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

అలాగే పిల్లలకు చదవాలనే కోరిక ఉన్నా తల్లిదండ్రుల వద్ద అంతగా స్థోమత లేకపోవడంతో వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయొవి అలాంటి వారికి తండ్రిలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *