వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ

వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ప్రారంభించింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడప ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ అన్బురాజన్‌తో ఏడుగురు సీబీఐ అధికారులు సమావేశమయ్యారు.

2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.

వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేట్టి ధర్మాసనం 4 నెలల ముందే ఈ కేసును సీబీకి అప్పగిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ‘మిస్టరీ’ ఇంకా వీడలేదని అప్పట్లో వ్యాఖ్యానించింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)/ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఈ కేసుపై మూడు సార్లు విచారణ చేపట్టారు.

దాదాపు 1,300 మంది అనుమానితులను విచారించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులను గుర్తించలేదని హైకోర్టు ఆక్షేపించింది.

కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.

హత్యకు రాజకీయ కారణాలా?, భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాలను సిట్‌ తేల్చలేకపోయిందని చెబుతూ.. హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహాన్ని హైకోర్టు వెలిబుచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం చాలా కీలకమైందని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.

సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, ‘తుది నివేదిక’ను దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ కేసుకు చెందిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *