బీసీ సంఘం ప్రెస్ మీట్


విశాఖపట్నం : గవర కులస్తుల కోసం ప్రత్యేకంగా గవర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజమండ్రిలో జరిగిన జయహో బిసి సభలో ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల కేంద్ర గౌరీ (గవర) సేవ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సోమవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో

సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారు, ప్రధాన కార్యదర్శి కర్ర అచ్యుతరావు గారు తదితరులు మాట్లాడుతూ గవర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా గవర కులస్తుల్లో చాలామంది పేదరికం అనుభవిస్తున్నారన్నారు.

ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చాలా కాలంగా తమ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకు వెళ్తునేవున్నామన్నారు.

తమ వినతిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జయహో బిసి సభ సాక్షిగా గవర కులస్థుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు

ప్రకటించడంతో లక్షలాది మంది గవర కులస్తుల్లో ఆనందం వెల్లువెత్తిందన్నారు. తమ జీవితాలకు భరోసా ఇచ్చినట్టు అయిందన్నారు.

ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ప్రస్తుతం ఉన్న బీసీ-డీ నుండి బీసీ-ఏ గా మార్చేందుకు, రాష్ట్ర రాజధాని అమరావతిలో కార్పొరేషన్ ఏర్పాటు కు వెయ్యి గజాల స్థలం కేటాయించేందుకు హామీ ఇవ్వడం హర్షనీయమన్నారు.

వెంటనే గవర కార్పొరేషన్ జీవోను విడుదల చేయడంతో పాటు కార్యాలయాన్ని ప్రారంభించి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు.

ముఖ్యమంత్రి గవర కార్పొరేషన్ ప్రకటించే విధంగా అవసరమైన కృషిచేసిన శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు, పీలా గోవింద సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న కు ప్రత్యేకంగా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆడారి అప్పారావు కర్రీ అచ్చుతరావు పేర్కొన్నారు.

మున్ముందు గవర కులస్తుల సంక్షేమానికి అభివృద్ధికి మరింత కృషి చేయాలని వారు కోరారు.

ఈ సమావేశంలో కేంద్ర గౌరీ (గవర) సేవ సంఘం పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *