కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్, ఫెడరల్ ఫ్రంట్ వైఎస్సార్సీపీకి లాభమా? శాపమా?

YS Jagan Reaction On KCR Return Gift || Latest Telugu News ||
చంద్రబాబు తెలంగాణా వచ్చి కాంగ్రెసుతో అపవిత్రంగా కూటమి కట్టేవరకు కాంగ్రెసు పార్టీ 45-50 వరకు గెలిచే అవకాశం ఉందని తలపండిన విజ్ఞులు అన్న మాట! తెరాసకు కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతికూలతలు కూడా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పాలన, ఫెయిలైన డబుల్ బెడ్రూం పథకం, ఆత్మార్పణం చేసిన వెయ్యి మంది పైగా ఉద్యమకారుల కుటుంబాలని నిర్ధాక్షిణ్యంగా నిరాదరించడం, కొత్త రాష్ట్రంలో కొలువులోస్తాయనే కొండంత ఆశలు వమ్మైన యువత, ఏ పచ్చ మాఫియా బూచి చూపి 2014లో గెలిచాడో అదే లాబీతో విందులు, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత లాంటి వాటితో తెరాస విజయం అంతా సులభంగా కనిపించలేదు! కానీ, ఎప్పుడైతే బాబు ప్రవేశించాడో అప్పుడు కేసిఆర్కి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది తెలంగాణా సెంటిమెంట్ అద్భుతంగా పండింది, అసెంబ్లీనే ఊడ్చేసాడు! ఇది వెల్కమ్ గ్రూప్ వేసిన అద్భుతమైన పాచికా లేక చంద్రబాబు అత్యుత్సాహమో ఆ ఈశ్వరునికే ఎరుక!
ఇప్పుడు మన ఏపీ విషయానికొస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని కేసిఆర్ నుండి ప్రతి తెరాస నాయకుడు చెప్తున్న మాట! చంద్రబాబుని ఓడిస్తామనా లేక గెలిపిస్తామనా అనేదే ఇక్కడ నాలాంటి కొంతమందిలో కన్ఫ్యూజన్. కొంతమంది ఆంధ్రా ప్రజానీకం హైదరబాద్లో ఉండి కానీ ఏపీలో తెలంగాణా ప్రజలు అసలు లేరు. మరి తెరాస ఎలా చంద్రబాబుని ఓడిస్తుంది? వైఎస్సార్సీపీ కి డబ్బు, వ్యూహాలు ఇచ్చి సాయం చెయ్యగలరు! హైదరాబాదులో ఉన్న తెలుగుదేశం బడాబాబుల డబ్బు ఏపీకి చేరకుండా నిలువరించవచ్చు. అంతేగానీ, మేము వైఎస్సార్సీపీకి సాయం చేస్తున్నామంటూ, చంద్రబాబుని ఒడిస్తున్నాం అంటే ఉద్యమ సమయంలో కేసిఆర్, తెరాస నాయకులు, ఉద్యమకారులు అన్న అడ్డగోలుగా మాటలని ఉపయోగించి సెంటిమెంటు రాజేస్తే ఆంధ్రా ప్రజానీకం మొత్తం మారకపోయినా ఒక 3% మారినా ఫలితాలు తారుమారు కావా? నిశ్శబ్దంగా వెనకనుండి సాయం చెయ్యాల్సిన కేసిఆర్ ఎందుకు ఇంత ప్రముఖంగా బహిరంగంగా మద్దతు ప్రటిస్తున్నాడు?
ఇది చంద్రబాబు చేసిన మేలుకు ప్రతిఫలంగా చేసే సాయమా, వెల్కమ్ గ్రూప్ వ్యూహమా? నేను ఇప్పటికే వింటున్నా ఆంధ్రా వాళ్ళని తిట్టి తరిమేసిన కేసిఆర్తో జగన్మోహన్ రెడ్డి గారు కలవడం ఏంటండీ అని!! ఒకవేళ ఇది వెల్కమ్ గ్రూప్ వ్యూహం కాకపోయినా దీన్ని వాడుకుని కొంత శాతం ప్రజలని మోసం చెయ్యడానికి తెలుగుదేశానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి కేసిఆర్ అయినా, జగన్ గారు అయినా?? కేసిఆర్ మద్దతు వలన మనకి ఒక్క ఓటు రాదు ఇది ఖచ్చితం కానీ ఒకవేళ సెంటిమెంట్ వర్క్ అయితే ఎన్నో కొన్ని ఓట్లు పోతాయి – ఇది అవసరమా వైఎస్సార్సీపీకి?
నిజంగా కేసిఆర్ చంద్రబాబుని ఓడించాలని, జగన్ గారిని గెలిపించాలని అనుకుంటే కేసిఆర్, తెరాస నాయకులు చంద్రబాబుని, తెలుగుదేశాన్ని ఒక్క మాట కూడా అనకుండా వైఎస్సార్సీపీ కి వెనకనుండి సాయం చేస్తారు!!
ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెరాస నాయకులు జగన్ గారిని కలుస్తున్నారని వింటున్నా! ఇదే నిజమైతే ఇది వైఎస్సార్సీపీ వ్యూహాత్మక ఘోర తప్పిదం! 2014 లాగానే ఎన్నికల ముందు ఒక తప్పిదం తర్వాత ఇంకోటి చేసుకుంటూ చంద్రబాబు చేతిలో మరోసారి అధికారం బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టే!! జాగ్రత్త!!!
కనీసం, తెరాసతో పొత్తు ఎందుకు ఉండాలో, ఆ పొత్తు వలన ఏపీకి ఏమి ప్రయోజనమో వైఎస్సార్సీపీ ఏపీ ప్రజలకి చెప్పగలగాలి. ప్రాజెక్టుల విషయంలో, ఇరు రాష్ట్రాల ఎంపీలు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామనో, ఇంకోటో ముందే ఆలోచించుకుని నాయకుడి దగ్గరనుండీ ఆఖరి కార్యకర్త వరకు ఒకే మాట చెప్పుకుంటూ ఒకే బాటలో నడవాలి!! నాకెందుకో ఇది దారిన పోయే కంపను మీదేసుకున్నట్టు ఉంది!!