చంద్రబాబు కి వ్యతిరేకంగా జగన్ వెనుక కేసీఆర్ వ్యూహరచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రికే చంద్రశేఖరరావు వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లొచంద్రబాబును ఓడించేందుకు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కితెరవెనుక ఉండి సాయం అందిస్తున్నట్లు అనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టినటె వున్నారు. కెసిఆర్ సాయంతో జగన్ అభ్యర్థులనుఎంపిక చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా పక్క రాష్ట్రంలో ఉండి జగన్ రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ఫిబ్రవరి 14న అమరావతిలో గృహప్రవేశం చేయాల్సి ఉండేది. అయితే సోదరి షర్మిల అనారోగ్యం కారణంగా ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు.

ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన లండన్ లోని తన కూతురి వద్దకు వెళ్లనున్నారు. ఈలోగానే తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని తన తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. కెసిఆర్ సలహాలు సూచనల ప్రకారమే జగన్ తన యోహాను ఖరారు చేసుకుని అమలు చేస్తున్నారని అభిప్రాయం చంద్రబాబు మాటల్లో వ్యక్తమైంది.

మరోవైపు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఆంధ్ర లో పర్యటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ రావు ద్వారా కెసిఆర్, జిల్లాలో కార్యక్రమాలకు పూనుకున్నట్టు భావిస్తున్నారు. పలువురు బీసీ నేతలు తలసాని తో భేటీ అవుతున్నారు.

దానికి తోడు తలసాని ఆధ్వర్యంలోనే బిసి సమావేశం చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆ జిల్లాల్లోని కాపు నేతలను బీసీ నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ వైపు తిప్పే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

అందుకే తలసాని పై చంద్రబాబు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తలసాని తెలుగుదేశం పార్టీని వీడి నాని చెబుతూ, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తలసాని తనకు మంచి మిత్రుడు అని చెప్పుకున్నారు. దీన్నిబట్టి ఏపీ లో జరుగుతున్న వ్యవహారాలు ఏమిటో అర్థమవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం మీద వైయజగన్ కావలసిన రాజకీయ క్షేత్రాన్ని కేసీఆర్ తీర్చిదిద్దుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *