తండ్రీ కొడుకులతో తమ్ముడు ముచ్చట్లు, ఆ ముచ్చట్లు చూసినా బాబుకి చెమటలు

అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం అనేక ఆసక్తికర పరిణామాలుకు వేదికగా మారింది.

గవర్నర్ దంపతులు నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు – వైసీపీ అధినేత వైఎస్ జగన్ – జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ – తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వనం పంపారు. అయితే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు కేసీఆర్-పవన్ కళ్యాణ్-తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరు కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

హైదరాబాదులోని రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ తేనేటి విందులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులు గా ఉండే నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

సీఎల్వి మాజీ నేత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో పాటుగా తెలంగాణ సీఎం కెసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

Popular Telugu actor and politician Pawan Kalyan on Saturday met Telangana Chief Minister K Chandrashekhar Rao and his son and Telangana Rashtra Samithi (TRS) Working President K T Rama Rao.


ఓవైపు పవన్ కళ్యాణ్ – కేటీఆర్ మధ్య ముచ్చట్లు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ – కేసీఆర్ మధ్య ముచ్చట్లు జరిగాయి.అలాకాగా ఏపీ లోని రాజకీయ పరిస్థితులపై గులాబీ దళపతి – జనసేన చర్చలు కొనసాగాయిని పలువురు అంచనావేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లో వైయస్ జగన్ పై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కేసీఆర్ జగన్ భేటీ పై కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఏపీ తెలంగాణ నేతలు ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాగా విందు సమావేశం కాస్త రాజకీయ చర్చలు వేదికైందని పలువురు చర్చించుకుంటున్నారు.

బాబుకి చెమటలు నరేంద్ర మోడీ, కేసీఆర్, వైయస్ జగన్ ఒక్కటయి ఆంధ్రప్రదేశ్ పై కక్ష సాగిస్తున్నారు.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు గగ్గోలు పెడుతునే వున్నారు. నిజానికి ఈ లిస్ట్లో కేసీఆర్ పేరు కొత్తగా వచ్చి చేరింది.

ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ పేరు ఉండేది. పవన్కళ్యాణ్ అవసరం ఏర్పడ్డాక చంద్రబాబు తెలివిగా.. తన ప్రత్యర్ధుల లిస్ట్ లోంచి పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టి స్నేహితుల లిస్ట్ లో చేర్చేసి .

మోడీనీ జగన్ నీ‌ , కేసీఆర్ నీ ఒక్క గాటున కట్టేశారు పాపం చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితులు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసారు. కేటీఆర్ తోనూ , కేసీఆర్ తోనూ మంతనాలు కూడా జరిపారు. ఇదంతా గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలోని సందడి నిజానికి నరసింహన్ 2 తెలుగు దేశ రాష్ట్రానికి గవర్నర్ గనుక ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరువుతారు.

గతంలో చంద్రబాబు హాజరయ్యారు. కేసీఆర్ తో మంతనాలు జరిపారు. ఎడమొహం, పెడమొహంగా చంద్రబాబు, కెసిఆర్ ఉన్నప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ ఇద్దరిని కలిపిన విషయాన్ని ఎలా మర్చిపోగలం? ఆయన పెద్దరికం ఆయన చూపించారు. ఆ తరువాత కేసీఆర్ చంద్రబాబు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం చంద్రబాబు ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు.ఈ టైంలో పవన్ కళ్యాణ్ , కేసీఆర్ కలయిక చంద్రబాబుకు మింగుడు పడే విషయమే కాదు… అలాగని పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు తిట్టనూలేరు. కుడితిలో పడ్డ ఎలకలా తయారైయిందిప్పుడు చంద్రబాబు పరిస్థితి.

దేన్నయినా సరే అందరూ తన కళ్ళతోనే చూడాలని నైజం చంద్రబాబుది. ఇదే రాజకీయంగా దిగజార్చేస్తూ వస్తొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *