కమ్మా సోదరులు ఇతర కులాల ఓటర్లను అనుమానిస్తున్నారు

Kamma brothers suspects other caste voters
జగన్ గారు చెప్పారని తెలంగాణలో సెటిల్ అయిన సీమాంధ్ర రెడ్డి సోదరులు టిఆరెస్ కి ఓట్లు వేశారు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పారని తెలంగాణలో సెటిల్ అయిన కాపు సోదరులు టిఆరెస్ కి ఓట్లు వేశారు.
తమ కులానికి తెలంగాణలో రిజర్వేషన్ తీసేసిన కెసిఅర్ కి గుడివాడలో కొప్పు వెలమ సోదరులు ఫ్లెక్సీలు కట్టారు.
తూర్పు కాపలకి రిజర్వేషన్ తీసేసిన కెసిఆర్ ని ముద్రగడ గారు ఎపికి ఆహ్వానిస్తున్నారు.
ఈ పైన చెప్పిన అన్ని విషయాల్లో మనకి అర్ధమైంది ఏంటంటే ప్రతి కులానికి చెందిన సోదరులూ ఆయా కులాలకు చెందిన ప్రధాన నాయకుల్ని అనుసరిస్తున్నారు. వారిని పూర్తిగా సమర్ధిస్తున్నారు. నాయకుల్లో కొన్ని లోపాలు వున్నా ఆ లోపాలని పక్కన బెట్టి మరీ ఆ నాయకులకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
రెడ్డి సోదరుల్ని గానీ , కాపు సోదరుల్ని గానీ లేదా ఏ ఇతర కులాల గురించీ తప్పుగా మాట్లాడడం లేదు. వాళ్ళు వారి వారి కులాల ఐక్యతను చాటుకుంటున్నారు.
కానీ మనం ఏం చేస్తున్నాం ? మనలో కొందరి గురించే ఈ ప్రశ్న.
కొన్ని విషయాల్లో ఆయనని ఇబ్బంది పెడుతున్నాం. మనవల్ల లేదా మనలో కొందరి వల్ల మనకు తెలియకుండానే ఆయన మీద , పార్టీ మీద ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతోందేమో అనిపిస్తోంది.
ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు కాబట్టి మనమీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మనం చేసే ప్రతి పనీ , మాట్లాడే ప్రతి మాట సమాజం గమనిస్తూ ఉంటుంది. మనం ఏ పొరపాటు చేసినా దాని ప్రభావం పార్టీపై పడుతుంది. సో … ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా , బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
తెలంగాణ ఫలితాలు వచ్చాక కెసిఆర్ , ఒవైసీ , ఎపిలో ప్రతిపక్ష నాయకులు ఆయన మీద ఎలా మాటల దాడి చేస్తున్నారో చూస్తున్నాం.
ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన సమయం. ఇప్పుడు మన ముందున్న తక్షణ లక్ష్యం ఎపిలో అధికారం మళ్ళీ పొంది రాష్ట్రాఅభివృద్ధికి ఆయనకు సహకారం అందించడమా ? లేదా ఇంకా ఏదైనా ఇతర అంశాలా ?
మన యువతలో ఆయన మీద వ్యతిరేకతను పెంచే ప్రణాళిక చాప కింద నీరులా అమలవుతోంది. అలాంటి వారి పట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి. మన వేలితో మన కన్నే పొడవాలనే ప్రతిపక్ష పార్టీలు పన్నే వలలో మనం పడరాదు.
ఆలోచించండి ఫ్రెండ్స్. ఆయన మళ్ళీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.
ఆయన ఒక్కడి మీదకి మోది , జగన్ , పవన్ , కెసిఆర్ , ఒవైసీ – వీళ్ళందరూ వ్యూహాత్మకంగా విడివిడిగా దాడి చేస్తున్నారు.వీళ్ళ ఉమ్మడి లక్ష్యం ఒక్కటే.ఆయన్ని గద్దె దించడం. ఇలాంటి క్లిష్ట సమయంలో మనందరం ఆయనకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. టిడిపి అధికారంలోకి మళ్ళీ వస్తేనే మనకి , మన రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది.
ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కాదు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ , సామాజిక పరిణామాల నేపథ్యంలో పెట్టిన పోస్టుగా భావించగలరు.
అందరూ అర్ధం చేసుకుంటారని భావిస్తూ …
తప్పులేమైనా వుంటే పెద్ద మనసుతో క్షమించగలరు.
ఇప్పుడు మనముందున్న తక్షణ/ఏకైక లక్ష్యం/ కర్తవ్యం ఆయనని మళ్ళీ ముఖ్యమంత్రి గా చేయడం.